Breaking News

ఓటీటీలో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి మూకీ సినిమా

Published on Sat, 02/28/2026 - 08:02

విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితీ రావు హైదరీ నటించిన సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్' ఓటీటీలోకి వచ్చేసింది. జనవరి 30న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించింది. వెండితెరపై మూకీ చిత్రాల యుగం ఎప్పుడో ముగిసింది. ఇలాంటి తరుణంలో ‘గాంధీ టాక్స్‌’ పేరుతో ఓ నిశ్శబ్ద చిత్రాన్ని  దర్శకుడు కిశోర్‌ తెరకెక్కించారు. ఇందులో ఒక్క డైలాగ్‌ కూడా వినిపించదు. కానీ,  ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అలరిస్తుంది.

‘గాంధీ టాక్స్‌’(Gandhi Talks) అమెజాన్‌ ప్రైమ్‌(amazon prime video)లో సడెన్‌గా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే, ఈ మూవీని చూడాలంటే రూ. 279 అధనంగా చెల్లించాల్సి ఉంటుంది. తమిళ్‌ వర్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కినప్పటికీ డైలాగ్స్‌ ఉండవ్‌ కాబట్టి భాషతో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. కానీ, ఇంగ్లీష్‌లో సబ్‌టైటిల్స్‌ ఉంటాయి.

కథేంటి..?
దేశంలోని ఆర్థిక పరిస్థితిలు ఆపై నిరుద్యోగం, అవినీతి వంటి అంశాలను సున్నితంగా స్పృశిస్తూ గాంధీ టాక్స్‌ కథ సాగుతుంది. డబ్బు అందరి జీవితాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో  ఈ మూవీలో చూపించారు. ముంబయి ధారావిలో జీవించే నిరుపేద కుర్రాడు మహాదేవ్‌ విష్ణు (విజయ్‌ సేతుపతి). చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ముంబై నగర మున్సిపాలిటీలో ఉద్యోగం‌ కోసం ప్రయత్నించగా రూ.50 వేలు లంచం అడుగుతారు. ఇంట్లో అనారోగ్యంతో ఉన్న తల్లి మరోవైపు ప్రేమించిన అమ్మాయి (అదితీ రావ్‌ హైదరి)ని పెళ్లి చేసుకోవాలనే తపన.. అందుకోసం తనకు  ఆ ఉద్యోగం చాలా అవసరం. 

అయితే, ఉద్యోగం దక్కాలంటే లంచం ఇవ్వాలి.. ఆ డబ్బు కోసం నైతిక విలువల్ని పక్కకు పెట్టి ఒక తప్పుడు పని చేసేందుకు రెడీ అవుతాడు. అదే ముంబైలో బోస్‌మన్‌ (అరవింద్‌ స్వామి)  బిగ్గెస్ట్‌ బిజినెస్‌మెన్‌గా రాణిస్తుంటాడు. అయితే, తన వ్యాపారంలో నష్టం రావడంతో రోడ్డున పడుతాడు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న బోస్‌మన​్‌ బయటపడేందుకు ఎలాంటి ప్లాన్‌ చేశాడు. మహాదేవ్‌ విష్ణు, బోస్‌ మన్‌లు ఇద్దరూ ఎలా కలుసుకున్నారు. డబ్బు వల్ల వారిద్దరి జీవితాలు ఎలా మారిపోయాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)