Breaking News

‘గాండీవధారి అర్జున’ కలెక్షన్స్‌.. వరుణ్‌ కెరీర్‌లోనే అతి తక్కువ..ఎంతంటే?

Published on Sat, 08/26/2023 - 16:37

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించింది. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్ట్‌ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. కథ, కథనంలో కొత్తదనం లేదని, దర్శకుడు మేకింగ్‌పై పెట్టిన దృష్టి బలమైన కథను రాయడంలో పెట్టలేదని విమర్శలు వచ్చాయి. పలు వెబ్‌సైట్లు కూడా ఈ చిత్రానికి నెగెటివ్‌ రివ్యూలే ఇచ్చాయి. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టడంలో ఈ చిత్రం విఫలమైంది.

(చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి)

వరుణ్‌ కెరీర్‌లోనే అతి తక్కువగా కేవలం 1.9కోట్ల కనెక్షన్స్‌ మాత్రమే రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే..నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ.15 లక్షలు, ఆంధ్రాలో రూ.65లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.50 లక్షలు కలెక్ట్‌ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.1.40 కోట్ల గ్రాస్‌, రూ. 75లక్షల షేర్‌ వసూళ్లను మాత్రమే రాబట్టింది.

(చదవండి:  ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ)

వరుణ్‌ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా మిగిలిన వరుణ్‌ గత సినిమా గని తొలి రోజు రూ. 3  ​కోట్లు రాబట్టడం గమనార్హం. ఈ లెక్కన వరుణ్‌ కెరీర్‌లోనే గండీవధారి అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయే అవకాశం మెండుగా ఉంది. ఇక ఈ చిత్రానికి రూ. 17 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్‌ జరిగినటట్లు సమాచారం. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే రూ. 18 కోట్లు రాబట్టాలి. తొలి రోజే వసూళ్లు దారణంగా ఉండడంతో బ్రేక్‌ ఈవెన్‌ అసాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)