Breaking News

‘గబ్బర్‌ సింగ్‌’ ఫేం రమేశ్‌కు బ్రెయిన్‌ స్ట్రో‍క్‌!

Published on Wed, 07/22/2026 - 17:00

‘గబ్బర్ సింగ్’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రమేశ్‌ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ కి గురికావడంతో కుటుంబ సభ్యులు తక్షణమే హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా లేదని, పరిస్థితి ఇంకా విషమంగానే ఉం‌దని అపోలో వైద్య బృందం వెల్లడించింది. 

హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్ కల్యాన్‌ హీరోగా నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రం ‘గబ్బర్ సింగ్’ (2012) ద్వారా రమేశ్‌ ప్రేక్షకులకు సుపరిచితుడయ్యారు. ఆ సినిమాలో వచ్చే ‘అంత్యాక్షరి’ కామెడీ ఎపిసోడ్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కల్యాణ్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అనంతరం అత్తారింటికి దారేది సినిమాలో కూడా కాసేపు కనిపించారు. వీటితో పాటు టాలీవుడ్‌లో పలు చిన్న, మధ్యతరహా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కామెడీ పాత్రల్లో నటించాడు. సోషల్ మీడియాలో కూడా రమేశ్‌ యాక్టివ్ గా ఉంటాడు. రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని కూడా షేర్ చేశాడు.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)