Breaking News

G 20 Review: అమెరికన్‌ ప్రెసిడెంటా.. మజాకా..

Published on Sun, 04/27/2025 - 15:55

ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్‌ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్‌ అవుతున్న వాటిలో హాలీవుడ్‌ చిత్రం జీ 20 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.

సినిమా దర్శకుని ఊహ అనేది ప్రేక్షకుల ఊహకందకపోతే అప్పుడు ఆ సినిమా పండుతుంది. ముఖ్యంగా హాలీవుడ్‌ దర్శకుల ఆలోచనలే వేరు. ఏది అసాధ్యమో, ఏదైతే జరగదు అని ప్రేక్షకులు అనుకుంటారో దాన్నే సినిమాలో చూపిస్తుంటారు హాలీవుడ్‌ డైరెక్టర్స్‌. హాలీవుడ్‌ దర్శకుడు పాట్రిసియా రీగెన్‌ తీసిన ‘జీ 20’ సినిమా ఆ కోవలోకి చెందినదే. 

ఒక్కసారి ఊహించండి... ప్రపంచంలోనే ఉత్తమోత్తమ సురక్షితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అనే విషయం మనకు తెలుసు. మరి... ఆ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని తన కుటుంబంతో పాటు బందీలుగా తీసుకుని ప్రపంచాన్ని శాసిద్దా మనకున్న విలన్‌ను అమెరికా ప్రెసిడెంట్‌ ఎలా ఎదుర్కొన్నారో ఈ ‘జీ 20’లో చూడవచ్చు. అది కూడా అమెరికన్‌ ప్రెసిడెంట్‌ను, అతని కుటుంబాన్ని బందీలుగా చేసుకోవడం కూడా చిన్న వేదిక మీదైతే కాదు, దాదాపు అరడజను దేశాధినేతలతో పాటు జీ 20 శిఖరాగ్ర సమావేశంలో హై సెక్యూరిటీ నడుమ ఉండగా అమెరికన్‌ ప్రెసిడెంట్‌తో పాటు అక్కడున్న మిగతా దేశాధినేతలందరినీ బందీలుగా చేసుకుంటాడు విలన్‌. 

ఇక్కడ ఈ సినిమా దర్శకుడు ఇంకా వినూత్నంగా ఆలోచించాడు. బందీలుగా ఉన్న తన కుటుంబాన్ని, ఇతర దేశాధినేతలను కూడా విలన్‌తో పోరాడి విడిపించే బాధ్యత ప్రెసిడెంట్‌ మీదే పెట్టాడు సదరు సినిమా డైరెక్టర్‌. ‘జీ 20’ సినిమా మంచి ఉత్కంఠతతో ప్రారంభమై, ఆద్యంతం ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది. 

ముఖ్యంగా అమెరికన్‌ ప్రెసిడెంట్‌ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలెట్‌ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో అమెరికన్‌ ప్రెసిడెంట్‌ కుంగ్‌ ఫూ ఫైటర్, గన్‌ షూటర్, అలాగే హెలికాప్టర్‌ రైడర్‌ కూడా. ఇక మరో పెద్ద ట్విస్ట్‌ ఏంటంటే సదరు అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ఈ సినిమాలో ఓ లేడీ. 

ఈ పాత్రలో డేనియల్‌ సట్టన్‌ సూపర్‌గా నటించారు. పైన చెప్పుకున్నట్టు ఓ లేడీ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ తన కుటుంబంతో పాటు ఇతర దేశాధినేతలను సూపర్‌ ఫైటింగ్‌ స్కిల్స్‌తో సేవ్‌ చేయడమనేది మామూలు కాన్సె΄్టా... ఆలోచించండి. దటీజ్‌ ‘జీ 20’. ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్‌ కూడా లభ్యమవుతోంది. అయితే మీ పిల్లలను ఈ సినిమాకి దూరంగా ఉంచి మీరు మాత్రం వాచ్‌ ఇట్‌ ఫర్‌ వీకెండ్‌. 
– హరికృష్ణ ఇంటూరు

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు