Breaking News

తెలుగు డైరెక్టర్ సినిమా.. నాలుగేళ్ల చిన్నారికి జాతీయ అవార్డ్‌

Published on Thu, 09/25/2025 - 20:01

ఇటీవల ఢిల్లీలో జాతీయ చలన చిత్రం అవార్డుల కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. 2023కు గానూ 71 జాతీయ సినీ అవార్డ్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందజేశారు. వేడుక సెప్టెంబర్ 23 ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అట్టహాసంగా జరిగింది. మెగా ఈవెంట్లో మలయాళ స్టార్మోహన్ లాల్ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నారు. టాలీవుడ్ నుంచి ఎంపికైన సినీ ప్రముఖులు జాతీయ అవార్డులు స్వీకరించారు.

అయితే జాతీయ అవార్డుల వేడుకల్లో అందరి దృష్టి చిన్నారి వైపు మళ్లింది. అత్యంత పిన్న వయసులో జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్న చైల్డ్ఆర్టిస్ట్గా ఘనత సాధించింది. ఉత్తమ బాలనటిగా త్రీషా వివేక్ తోసర్ నిలిచింది. మహారాష్ట్రకు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ అవార్డ్అందుకుంది. ఉత్తమ బాలనటి అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది.

మరాఠీ చిత్రం 'నాల్ 2'లో నటనకు గానూ అవార్డ్ దక్కించుకుంది. సినిమాను తెలుగు వ్యక్తి సుధాకర్ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో తెరకెక్కించారు. నాగరాజ్ ముంజులే నిర్మించిన చిత్రాన్ని జీ స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో త్రీషాకు మూడేళ్లే కావడం విశేషం. ప్రతిష్టాత్మక అవార్డ్ అందుకున్న నాలుగేళ్ల త్రీషా వివేక్ తోసర్ను ట్విటర్ వేదికగా కమల్ హాసన్ అభినందించారు. మీరు నా రికార్డును అధిగమించారని చిన్నారిని కొనియాడారు. నేను ఆరేళ్ల వయసులో మొదటిసారిగా అవార్డు అందుకున్నానని తెలిపారు.

జాతీయ చలనచిత్ర అవార్డు గెలుచుకున్న తర్వాత త్రీషా తోసర్ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రపతి నన్ను అభినందించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. చిన్నారితో మోహన్ లాల్, షారూఖ్ ఖాన్ ఫోటోలు దిగారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)