Breaking News

వెండితెరపై కిరణ్‌ బేడీ బయోపిక్‌.. టైటిల్‌ ఇదే!

Published on Wed, 06/12/2024 - 11:26

భారతదేశపు తొలి మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌ కిరణ్‌ బేడి జీవితం వెండితెరపైకి రానుంది. ‘బేడి: ది నేమ్‌ యు నో.. ది స్టోరీ యూ డోన్ట్‌’ అనే టైటిల్‌తో ఆమె బయోపిక్‌ తెరకెక్కనుంది. ‘వన్‌ వే, అనదర్‌ టైమ్‌’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో ప్రసంశలు అందుకున్న దర్శక–నిర్మాత, రచయిత కుశాల్‌ చావ్లా ఈ బయోపిక్‌కు దర్శకత్వం వహించనున్నారు. డ్రీమ్‌ స్లేట్‌ పిక్చర్స్‌ పతాకంపై గౌరవ్‌ చావ్లా ఈ సినిమాను నిర్మించనున్నారని, వచ్చే ఏడాది ఈ సినిమా విడుదయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. 

‘‘కిరణ్‌ బేడీగారు జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాత్రమే కాదు... ఆమె జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నాం’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ఇక 1966లో జాతీయ జూనియర్‌ టెన్నిస్‌ చాంపియన్‌గా వార్తల్లో నిలిచారు కిరణ్‌ బేడీ. ఆ తర్వాత ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ఎన్నో సంస్కరణలు చేశారు. ‘పాండిచ్చేరికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా చేశారు. అలాగే రామన్‌ మెగసెసే అవార్డ్స్‌తో పాటు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు కిరణ్‌ బేడీ. ఇక వెండితెరపై ఆమె పాత్రను ఎవరు చేస్తారు? అనేది చిత్రబృందం ప్రకటించలేదు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)