'మిత్రమండలి' మూవీతో ఎన్ని కోట్లు పోయాంటే..: నిర్మాత

Published on Tue, 12/30/2025 - 12:34

నటుడు ప్రియదర్శి, నిహారిక ఎన్ ఎం హీరో హీరోయిన్లుగా నటించిన  చిత్రం ‘మిత్రమండలి’.. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్‌పై కల్యాన్‌ మంతిన, భాను ప్రతాప,డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. అయితే, ఈ మూవీకి  సమర్పకులుగా నిర్మాత  బన్నీ వాస్‌ ఉన్నారు. దీంతో సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది. బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా మిగిలిన ఈ మూవీ నష్టాలను మిగిల్చిందని తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో బన్నీ వాస్‌ పేర్కొన్నారు.

‘మిత్రమండలి’ సినిమా తమకు నష్టాలను తెచ్చిందని బన్నీ వాస్‌ ఇలా అన్నారు. 'సినిమా పూర్తి అయ్యాక ఎడిటింగ్‌ రూమ్‌లో అందరం చూశాం. చాలా బాగుందని మాకు అనిపించింది. దీంతో థియేటర్స్‌లలో ప్రేక్షకులు కూడా నవ్యూతూ బాగా ఎంజాయ్‌ చేస్తారనుకున్నాం. కానీ, ఎక్కడో పొరపాటు జరిగింది. ప్రేక్షకులతో పాటు నేను కూడా సినిమా చూశాను. వారిలో నవ్వు అనేది కనిపించలేదు. నేను అంచనా పెట్టుకున్న సీన్లు కూడా మెప్పించలేదు. తొలిసారి మా అంచనా తప్పు అయింది. అయితే, ఎడిటింగ్‌లో పొరపాటు చేశామని తర్వాత అర్థమైంది. ఫైనల్‌ కాపీని విడుదలకు ముందు మరోసారి చూసుకొని ఉండింటే బాగుండేది. కానీ, కొన్ని కారణాల వల్ల కుదరలేదు. దీంతో మిత్రమండలి మూవీ వల్ల రూ. 6 కోట్లు నష్టపోయాం.' అని బన్నీ వాస్‌ పేర్కొన్నారు.

మిత్రమండలిలో  బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌,సత్య, విష్ణు, రాగ్‌ మయూర్‌ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్‌ 16న విడుదలైన ఈ చిత్రం 20రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌(amazon prime video)లో స్ట్రీమింగ్‌ అవుతుంది. సుమారు రూ. 15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ రైట్స్‌తో కలుపుకొని రూ. 9 కోట్ల వరకు మాత్రమే రికవరీ చేసినట్లు సమాచారం.

Videos

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)