Breaking News

గ్యాప్‌ కాదు.. ప్రిపరేషన్‌..

Published on Sun, 12/01/2024 - 13:17

ఫ్యాషన్‌ షోలో దేవకీనందన వాసుదేవ ఫేమ్‌ నటి, మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి ర్యాంప్‌ వాక్‌తో అదరగొట్టిన మోడల్స్‌

తెలుగు సినిమా ఇండస్ట్రీ సొంత ఇల్లు. నా మనసు ఎప్పుడూ ఇంట్లోనే ఉంటుందని దేవకీనందన వాసుదేవ ఫేమ్, మాజీ మిస్‌ ఇండియా మానస వారణాసి పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న ఆమె సాక్షితో ముచ్చటించారు. 2020లో మిస్‌ ఇండియాగా ఎంపికయ్యాను. 2024లో తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చా. ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్‌ తీసుకున్నారని పలువురు అంటున్నారు.. అయితే ఇది గ్యాప్‌ కాదు.. నాకు ప్రిపరేషన్‌లా అనిపిస్తోంది. ముంబై నుంచి తిరిగి హైదరాబాద్‌ చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. నా ప్యాషన్‌ ఎప్పుడూ సినిమాపైనే. మొన్ననే దేవకీనందన వాసుదేవ రిలీజ్‌ అయ్యింది. చేతిలో కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. 

వివిధ రకాల థీమ్స్‌ వస్త్రాలతో మోడల్స్‌ ర్యాంప్‌ వాక్‌ చేశారు. డిజైనర్‌ అర్జెంటుమ్‌ ఆర్ట్స్‌ రాజ్‌ దీప్‌ రణవ్‌ తీర్చిదిద్దిన డిజైనర్‌ దుస్తులను మోడల్స్‌ ర్యాంపుపై ప్రదర్శించారు. ప్రదర్శనలో భాగంగా డిజైనర్లు లక్ష్మీ రెడ్డి, వస్త్రలేఖ, మంగళగౌరి, ఆదరణ, విశిష్ట గోల్డ్‌ అండ్‌ డైమండ్స్, యక్షి దీప్తి రెడ్డి, అంజలీ, అర్జున్‌ కపూర్‌ ప్రముఖ డిజైనర్స్‌కు చెందిన కలెక్షన్లు, ప్రముఖ సినీ తారలు మానస వారణాసి, సీరత్‌ కపూర్, ప్రజ్ఞ అయ్యగారి, మాళవిక మోహన్, నేహా శెట్టి షో టాపర్స్‌గా మెరిశారు. ఈ మోడల్‌ షోలో 16 మంది డిజైనర్లు రూపొందించిన సరి కొత్త డిజైన్లను రెండు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్‌ ర్యాంపుపై సందడి చేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)