Breaking News

విజయ్‌ దేవరకొండ, రష్మికకు దక్కిన అరుదైన గౌరవం

Published on Mon, 08/18/2025 - 08:49

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న అరుదైన గౌరవం దక్కించుకున్నారు.  న్యూయార్క్‌లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) నిర్వహించిన భారీ పరేడ్‌కు వారిద్దరూ ' గ్రాండ్‌ మార్షల్‌'గా వ్యవహరించారు.  FIA అనేది అమెరికాలోని భారతీయ ప్రవాసుల కోసం స్థాపించబడిన ప్రముఖ సంస్థ. ఇది 1970లో ప్రారంభమై, ప్రధానంగా న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, మాసాచుసెట్స్, రోడ్ ఐలాండ్, న్యూ హాంప్‌షైర్, వెర్మాంట్ మరియు మైన్ రాష్ట్రాల్లో భారతీయ సముదాయాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది. ప్రస్తుతం 43వ గ్రాండ్‌ మార్షల్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో  ' గ్రాండ్‌ మార్షల్‌'గా పాల్గొన్నవారికి ప్రత్యేక గౌరవం దక్కుతుంది. వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కుతుంది.

ప్రపంచంలో అతిపెద్ద భారతీయ పరేడ్ ప్రతి సంవత్సరం న్యూయార్క్‌లో నిర్వహించబడుతుంది. ఇది భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఘనమైన వేడుక. 2025 సంవత్సరానికి గాను, సినీ తారలు విజయ్ దేవరకొండ,  రష్మిక మందన్న “గ్రాండ్ మార్షల్స్”గా పాల్గొన్నారు. వీరి హాజరు పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, కాంగ్రెస్ సభ్యులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడం ఆపై ప్రవాస భారతీయుల ఐక్యతను బలపరచడం వంటి అంశాల్లో గత 42 ఏళ్లుగా FIA పనిచేస్తుంది. 2022లో ఇదే గౌరవాన్ని టాలీవుడ్‌ నుంచి మొదటిసారి అల్లు అర్జున్‌ అందుకున్నారు.

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)