అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
Breaking News
విలన్ పాత్ర.. రూ. 20 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్ హీరో!
Published on Sat, 03/28/2026 - 14:22
విభిన్నమైన పాత్రలు, విలక్షణమైన నటనతో ఆకట్టుకునే నటుడు ఫహద్ ఫాజిల్. ఈ మలయాళ నటుడికి తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. ‘పుష్ప’ చిత్రం తర్వాత ఆయనకు టాలీవుడ్లో విపరీతమైన క్రేజీ ఏర్పడింది. వరుస ఆఫర్లు వచ్చాయి. కానీ ఆయన ‘డోన్ట్ ట్రబుల్ ద ట్రబుల్’ మినహా..తెలుగులో ఇంకో చిత్రమేది చేయడం లేదు. తెలుగులోని బడా నిర్మాతలంతా ఆయన కోసం క్యూ కడుతున్నా.. ఒక్క ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. దానికి కారణం రెమ్యునరేషన్.
తెలుగు సినిమాలో విలన్‌గా నటించడానికి భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. హీరోగా కాకుండా విలన్‌గా నటించాలంటే.. రూ. 15-20 కోట్లు ఇవ్వాల్సిందేనని కండీషన్ పెడుతున్నారట. అంత మొత్తంలో ఇచ్చుకోలేక.. నిర్మాతలకు వెనుకంజ వేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ నడుస్తోంది. అందుకే ఫహద్‌కు టాలీవుడ్లో అవకాశాలు రావడం లేదు.
అనిల్ రావిపూడి తెరకెక్కించే కొత్త సినిమాలో వెంకటేశ్‌తో పాటు ఫహద్‌ని కూడా అనుకున్నాడట. అయితే పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేయడంతో.. ఆ స్థానంలో కల్యాణ్ రామ్‌ని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అలాగే రామ్ సినిమాలోనూ విలన్‌గా ఫహద్‌నే తీసుకోవాలనుకున్నారట. అక్కడ కూడా పారితోషికం విషయంలోనే ఇబ్బందులు ఎదురై.. చివరకు వదిలేశారట. ఫహద్‌ని తీసుకుంటే మలయాళంతో పాటు పాన్ ఇండియా మార్కెట్‌కి కూడా ప్లస్ అవుతుందని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు.
అయితే భారీ పారితోషికం డిమాండ్ చేయడంతో.. అంత ఇచ్చుకోలేక ఇతర నటులవైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు ఫహద్ కూడా రొటీన్ విలన్ పాత్రలు చేయడానికి ఇష్టపడడం లేదట. తనకు గుర్తింపు తెచ్చేలా ఉంటేనే ఆ పాత్రలో నటించేందుకు ముందుకు వస్తున్నాడట. లేదంటే హీరోగా సినిమాలు చేసుకుందామనే ఆలోచనలోనే ఉన్నారట. విలన్ కంటే హీరో పాత్రలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది.
Tags : 1