Breaking News

అప్పుడు భయం వేసింది

Published on Fri, 04/28/2023 - 03:57

‘‘నా చిన్నతనం నుంచే నేను యాక్టర్‌ని కావాలనుకున్నాను. యాక్టింగ్‌ క్లాసులకు వెళ్లాను. అయితే కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన తక్కువ సమయంలోనే రజనీకాంత్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్‌ వంటి సూపర్‌ స్టార్స్‌తో నటించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను’’ అన్నారు హీరోయిన్‌ మిర్నా మీనన్‌. ‘నాంది’ తర్వాత హీరో ‘అల్లరి’ నరేశ్, దర్శకుడు విజయ్‌ కనకమేడల కాంబినేషన్‌లో రూ΄÷ందిన చిత్రం ‘ఉగ్రం’. ఈ చిత్రంలో మిర్నా మీనన్‌ హీరోయిన్‌గా నటించారు.

సాహు గార΄ాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రం మే 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మిర్నా మీనన్‌ మాట్లాడుతూ– ‘‘క్రేజీఫెలో’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాను. రజనీకాంత్‌గారి ‘జైలర్‌’ సినిమాలో ఓ కీ రోల్‌ చేస్తున్నాను. సెట్స్‌లో రజనీగారు చాలా డౌన్‌ టు ఎర్త్‌ ఉంటారు. ఆ మాట, నడక అన్నింటిలో ఓ స్టైల్‌ ఉంటుంది. ఆయన స్టైల్‌తోనే పుట్టి ఉంటారనుకుంటున్నాను. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడే నాకు ‘ఉగ్రం’కి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో నేను కాలేజీ అమ్మాయిలా, గృహిణిలా, ఓ బిడ్డకు తల్లిలా పలు షేడ్స్‌లో కనిపిస్తాను.

ఒకే సినిమాలో విభిన్న రకాల లుక్స్‌తో కనిపించడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలోని ప్రతి సీన్‌కు ఓ మీనింగ్‌ ఉంటుంది. ‘ఉగ్రం’ కోసం దాదాపు  70 రోజులు వర్క్‌ చేశాను. ఇందులో 55 రోజులు నైట్‌ షూట్‌ చేశాం. కంటిన్యూస్‌గా 15 రోజులు నైట్‌షూట్‌లో ΄ాల్గొన్నాను. ఓసారి బ్రేక్‌ లేకుండా 48 గంటలు వర్క్‌ చేశాను. ఇదో డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌. ట్రైలర్‌లో చూసిన కారు యాక్సిడెంట్‌ సీన్‌ మేం రియల్‌గానే చేశాం. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. నరేశ్‌గారికి చిన్న΄ాటి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం అమీర్‌గారి డైరెక్షన్‌లో ఓ తమిళ సినిమా చేస్తున్నాను. మలయాళంలో ఓ  సినిమా కమిట్‌ అయ్యాను’’ అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)