Breaking News

‘భారతీయన్స్’పై మాజీ సైనికాధికారులు ప్రశంసలు!

Published on Tue, 05/30/2023 - 16:41

ప్రముఖ రచయిత, ప్రేమకథా చిత్రాల స్పెషలిష్ట్‌  దీన్‌ రాజ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్‌’.  నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్, హీరోలుగా... సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత  నిర్మించారు.

తాజాగా ఈ చిత్రాన్ని మాజీ సైనికాధికారుల కోసం ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. చైనా నీచ బుద్ధిని ఎండగడుతూ... రూపొందిన "భారతీయన్స్" చిత్రం సంచలన విజయం సాధించాలని వారు కోరుకున్నారు. దేశ రక్షణ కోసం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో తాము నిర్వర్తించిన విధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని... మాజీ సైనికా దుకారులు ఉద్వేగానికి గురయ్యారు.

నిర్మాత డాక్టర్ శంకర్ నాయుడు మాట్లాడుతూ... మన సైనికుల ప్రాణాలు బలి తీసుకుంటూ... మన దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి భంగం కలిగించే నీచ చర్యలకు పాల్పుతున్న చైనా పేరును తొలగించమని సెన్సార్ వారు చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందని, ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళడానికయినా తాను సిద్ధంగా ఉన్నామని అన్నారు. త్రివిధ దళాల్లో పనిచేసిన మన దేశ ముద్దుబిడ్డలైన సైనికాధికారులు "భారతీయన్స్" చిత్రం చూసి మెచ్చుకోవడం... తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు దర్శకుడు దీన్ రాజ్. ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సంగీత దర్శకుల్లో ఒకరైన కపిల్ కుమార్, హీరోల్లో ఒకరైన నీరోజ్ పుచ్చా ఫాదర్ రమణ మూర్తి, మాజీ సైనికాధికారులు శ్రీనేష్ కుమార్ నోరి, కెప్టెన్ సురేష్ రెడ్డి, రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)