‘చరిత్ర’లో శంభాజీ గురించి ఎందుకు చెప్పలేదు: మాజీ క్రికెటర్‌ ప్రశ్న

Published on Tue, 02/18/2025 - 12:51

బాక్సాఫీస్‌ వద్ద హిందీ చిత్రం ‘ఛావా’(Chhaava Movie) దూసుకెళ్తోంది. విక్కీ కౌశల్‌, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం తొలి రోజే రూ.31 కోట్లు వసూళ్లు సాధించింది. రిలీజ్‌ రోజే హిట్‌ టాక్‌ రావడంతో వసూళ్లు అమాంతం పెరిగాయి. ఇప్పటి వరకు రూ.121 కోట్లు వసూళ్లు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కలెక్షన్ల సంగతి పక్కన పెడితే.. ఈ మూవీపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపించారంటూ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ని పొగిడేస్తున్నారు. తాజాగా ఈ సినిమా చూసిన ఇండియన్‌ మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) ఎక్స్‌ వేదికగా సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే కొన్ని ఆసక్తికర ప్రశ్నలు లేవనేత్తారు.

‘ఈ రోజే ఛావా చిత్రం చూశాను. ధైర్యం, నిస్వార్థం, వృత్తిపట్ల ఉన్న అంకితభావం ఉన్న గొప్ప కథ ఇది. నిజాయతీగా ఒక ప్రశ్నలు అడగాలనుకుంటున్నా.. ‘ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ చరిత్ర స్కూల్లో ఎందుకు నేర్పించలేదు? పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి ఎక్కడ ప్రస్తావించలేదు? కానీ అక్బర్‌ గొప్ప నాయకుడు, న్యాయంగా పాలించిన చక్రవర్తి అని మనం నేర్చుకున్నాం. అంతేకాదు ఢిల్లీలోకి ఓ రహదారికి ఔరంగజేబు రోడ్డు అని పేరు కూడా పెట్టుకున్నాం. అలా ఎందుకు జరిగింది?అని తన ఎక్స్‌ ఖాతాలో ఆకాశ్‌ చోప్రా ప్రశ్నించాడు.

ఆకాశ్‌ చోప్రా ట్వీట్‌పై నెటిజన్స్‌ భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఆకాశ్‌ ట్వీట్‌ని సమర్థిస్తుండగా..మరికొంతమంది మాత్రం ఇలాంటి వివాదాలు సృష్టించే ట్వీట్స్‌ చేయొద్దని విమర్శిస్తున్నారు. ‘చరిత్ర తెలుసుకోవడానికి సినిమా ఎప్పుడూ నమ్మదగిన మాధ్యమం కాదు. ఎవరు ఏ ఏ స్థాయిలో కృషి చేశారనే చరిత్ర మొత్తం చూస్తే అర్థం అవుతుంది.  మౌర్య/గుప్త సామ్రాజ్యాలు, అక్బర్, ఔరంగజేబు, శివాజీ సహజంగానే శంభాజీ కంటే ఎక్కువ ప్రాధాన్యతతను పొందారు’ అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు. ‘చరిత్ర తెలుసుకో ఆకాశ్‌’ అని మరో నెటిన్‌ కామెంట్‌ చేయగా.. ‘నేను హిస్టరీలో టాపర్‌ని. చరిత్రలో నాకు 80 శాతం మార్కులు వచ్చాయి’ అని ఆకాశ్‌ రిప్లై ఇచ్చాడు. 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)