Breaking News

ఆ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డ తరుణ్‌ భాస్కర్‌.. ఫోటోలు వైరల్‌!

Published on Tue, 10/21/2025 - 10:12

సినీ తారల ప్రేమ, పెళ్లిపై రోజూ రకరకాల రూమర్స్‌ వస్తుంటాయి. రిలేషన్స్‌లో ఉన్నారని.. పెళ్లి జరిగిందని..ఇలాంటి పుకార్లు దాదాపు అందరిపై వస్తుంటాయి. వాటిలో కొన్ని నిజం అయితే చాలా వరకు అబద్దాలుగానే మిగిలిపోతాయి. తాజాగా టాలీవుడ్‌కి చెందిన ఓ హీరోయిన్‌పై కూడా అలాంటి ‘రిలేషన్‌’ రూమర్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. యండ్‌ డైరెక్టర్‌తో ఆమె ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరు కలిసి దీపావళి పండగను జరుపుకోవడంలో మరోసారి వీరిద్దరి రిలేషన్‌పై నెట్టింట చర్చ మొదలైంది. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరో చెప్పలేదు కదా.. తెలుగు అమ్మాయి ఈషా రెబ్బ(Eesha Rebba). ప్రేమలో పడింది.. యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌( Tharun Bhascker ).

2012లొ లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ చిత్రంలో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి ఈషా రెబ్బ. తొలి చిత్రంతోనే నటన పరంగా మంచి మార్కులే సంపాదించుకుంది. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. కానీ అనుకున్న స్థాయిలో గుర్తింపుని తీసుకురాలేకపోయాయి. దీంతో అరవింద సమేత వీర రాఘవ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ లాంటి సినిమాల్లో కీలక పాత్రలో నటించి మెప్పించింది. చాలా సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. అలాగే పలు వెబ్ సిరీస్‌లోనూ నటించింది. త్రీ రోజెస్ సినిమాలో కొంచం బోల్డ్ పాత్రలో నటించినా.. ఈ బ్యూటీకి అనుకున్నంత గుర్తింపు అయితే రాలేదు.

తరుణ్‌తో ప్రేమలో..
యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌తో ఈషా ప్రేమలో ఉన్నారనే పుకారు గత కొంతకాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉంది. గతంలో వీరిద్దరు కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు వీరిద్దరి ఫోటోలో బాగా వైరల్‌ అయ్యాయి. తాజాగా ఇద్దరు కలిసి దీపావళి పండుగను సెలెబ్రేట్‌ చేసుకున్నారు. యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ ఇంట్లో జరిగిన దీపావళి వేడుకకి తరుణ్‌, ఈషా కలిసి వెళ్లారు. విశ్వక్‌ ఫ్యామిలీతో కలిసి టపాసులు కాలుస్తూ సందడి చేశారు. 

వీళ్లిద్దరూ క్లోజ్ గా కనిపించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే త‌రుణ్‌, ఈషా రెబ్బ‌ మధ్య రిలేషన్ ఉన్నారనే విషయంపై మరోసారి నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రేమలో ఉన్నారని..త్వరలోనే పెళ్లి చేసుకుంటారని కొంతమంది అంటుంటే.. అదేం లేదు..  తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ఈషా రెబ్బ‌ త్వరలో కొత్త సినిమా చేయబోతున్నారని, అందుకే అతనితో వెళ్ళినట్లు మరికొంత మంది అంటున్నారు.  వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే కానీ వాస్తవం ఏది అనేది తెలియదు. 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)