Breaking News

ఆయనతో నటించడం కలలా అనిపించింది

Published on Mon, 08/12/2024 - 10:59

కొందరికి గ్లామరస్‌ పాత్రలో నటించాలనే కోరిక ఉన్నా, నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలే వస్తుంటాయి. అలాంటి వారిలో నటి దుషారా విజయన్‌ ఒకరు. బోదై ఏరి బుద్ధి మారి చిత్రంతో కథానాయకిగా పరిచయమైన నటి ఈమె. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించినా గుర్తింపు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మడు దర్శకుడు పా.రంజిత్‌ దృష్టిలో పడ్డారు.

 అలా ఆయన దర్శకత్వంలో ఆర్య కథానాయకుడిగా నటించిన సర్పట్ట పరంపరై చిత్రంలో నాయకిగా నటించారు. ఆ చిత్రం విజయాన్ని సాధించడంతోపాటు దుషారా విజయన్‌ నటనకు ప్రశంసలు లభించాయి. ఆ చిత్రంతోనే ఇలాంటి మంచి నటి ఉన్నారన్నది కోలీవుడ్‌కు తెలిసింది. ఆ తర్వాత మళ్లీ పా.రంజిత్‌ దర్శకత్వంలోనే నక్షత్రం నగరగిరదు చిత్రంలో నటించారు. ఆ  చిత్రం కూడా దుషారా విజయన్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

ఆ తర్వాత కళువేత్తి మూర్ఖన్, అనీతి వంటి చిత్రాల్లో నటించారు. విశేషమేమిటంటే ఇప్పటివరకు ఈమె నటించిన కథా పాత్రలన్నీ గ్లామర్‌కు తావు లేకుండా నటనకు అవకాశం ఉన్న చిత్రాలే కావడం గమనార్హం. కాగా ఇటీవల కథ డిమాండ్‌ చేస్తే గ్లామరస్‌గా నటించడానికి సిద్ధమే అని దుషారా విజయన్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు కూడా. అయినప్పటికీ ఈమెకు అలాంటి పాత్రలు రావడం లేదు ఇటీవల ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్‌ చిత్రంలో ఆయనకు చెల్లెలుగా ముఖ్యపాత్రను పోషించారు.

 తాజాగా రజనీకాంత్‌ కథానాయకుడిగా నటించిన వేట్టైయాన్‌ చిత్రంలో కీలకపాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. దీని గురించి దుషారా విజయన్‌ పేర్కొంటూ వేట్టైయన్‌ చిత్రంలో రజనీకాంత్‌తో కలిసి నటించాల్సి ఉండడంతో ముందురోజే తనకు చలి జ్వరం వచ్చేసిందన్నారు. ఆయనతో కలసి నటించడం తనకు కలగా అనిపించిందన్నారు. ఈ చిత్రంలో తనది చాలా బరువైన పాత్ర అని పేర్కొన్నారు. అదేవిధంగా ఫాహత్‌ ఫాజిల్‌ వంటి నటుడితో కలిసి నటించే అవకాశం వేట్టైయన్‌ చిత్రం కలిగించిందని దుషారా విజయన్‌ సంతోషం వ్యక్తం చేశారు.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)