Breaking News

బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను..ఆయనది గొప్ప వ్యక్తిత్వం

Published on Fri, 01/06/2023 - 08:07

‘‘బాలకృష్ణగారి సినిమాలు చూస్తూ పెరిగాను.. అలాంటిది ఆయనతో కలసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్‌లో చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయాను.. ఆయనది గొప్ప వ్యక్తిత్వం’’ అని నటుడు దునియా విజయ్‌ అన్నారు. బాలకృష్ణ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ చిత్రంలో మెయిన్‌ విలన్‌ పాత్ర పోషించిన కన్నడ నటుడు దునియా విజయ్‌ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారు బ్రిలియంట్‌ డైరెక్టర్‌. ‘వీరసింహారెడ్డి’ లో నా పాత్ర (ముసలిమడుగు ప్రతాప్‌ రెడ్డి) గురించి చెప్పినప్పుడే చాలా థ్రిల్‌ అనిపించింది. చాలా మొరటుగా ఉండే నా పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.

ఇంత మంచి పాత్రలో బాలకృష్ణగారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన ఎనర్జీ సూపర్‌.. పనిపట్ల అంకితభావం గొప్పగా ఉంటుంది. ‘వీరసింహారెడ్డి’ ఆయన అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్‌ ఎమోషనల్‌ జర్నీ. ఒక నటుడిగా అన్ని పాత్రలూ చేయాలని ఉంటుంది. ఈ సినిమా తర్వాత కూడా మంచి పాత్రలు వస్తే విలన్‌గా చేయడానికి సిద్ధమే. నటన, దర్శకత్వం వేర్వేరు. నటుడిగా చేస్తున్నప్పుడు నా దృష్టి కేవలం నటనపైనే ఉంటుంది. దర్శకునిగా చేస్తున్నప్పుడు నా నుండి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో దానిపైనే ఫోకస్‌ ఉంటుంది. ప్రస్తుతం కన్నడలో ‘భీమ’ అనే చిత్రంలో నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నాను. తెలుగులోనూ కొన్ని చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)