మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్
Breaking News
‘ఐ యామ్ గేమ్’ ట్విటర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
Published on Thu, 09/03/2026 - 13:59
నహాస్ హిదాయత్ దర్శకత్వంలో హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లేటేస్ట్ మూవీ ఐ యామ్ గేమ్. ఈ సినిమాకు దుల్కర్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా కోసం ఎదురుచూసిన తెలుగు ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. తెలుగు వెర్షన్ నేడు( సెప్టెంబర్ 3) విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో ఆగిపోయింది. అయితే మలయాళ వెర్షన్లో యథాతథంగా విడుదల చేశారు.
ఈ సినిమా చేసిన ప్రేక్షకులు తమతమ అభిప్రాయలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. సినిమా ఫస్టాఫ్, దుల్కర్ నటన, విజువల్స్, నేపథ్య సంగీతంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫస్టాఫ్ మంచి వినోదాన్ని అందించిందని అంటున్నారు. ఇంటర్వ్ల్లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలెట్గా నిలుస్తాయంటున్నారు.
#ImGame First Half Superb! 👌🔥
The film gets off to a strong start with an excellent first 30 minutes, setting up the world and characters really well. The fantasy element and core plot then take some time to establish, but once that phase is done, the film picks up really well… pic.twitter.com/6Fu5ckIdmw— Balaji (@RDBalaji) September 3, 2026
‘ఈ చిత్రం ఆరంభం అదిరిపోయింది. తొలి 30 నిమిషాలు అద్భుతంగా సాగుతూ కథా ప్రపంచాన్ని పాత్రలు చాలా చక్కగా పరిచయం చేస్తాయి. ఆ తర్వాత ఫాంటసీ అంశం, అసలు కథను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి కొంత సమయం తీసుకుంటుంది. మళ్లీ కొన్ని సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేస్తుంటాయి’ అని నెటిజన్ పోస్ట్ చేశారు.
#ImGame is an overall entertaining watch with some really enjoyable moments. The VFX work stands out, while Jakes Bejoy’s music adds great energy throughout.
I m game movie Rating - ⭐⭐⭐⭐ 4/5 ALL TIME BLOCKBUSTER ❤️🔥🔥!!@dulQuer delivers a super performance, and especially… pic.twitter.com/gHyl4xoSym— its cinema (@itscinemaoficl) September 3, 2026
‘ఐ యామ్ గేమ్’ మంచి వినోదాన్ని ఇచ్చే చిత్రం. సినిమాలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. విజువల్ ఎఫెక్ట్ ఆకట్టుకునేలా ఉంటాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం సినిమాకు బలం. కీలక సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది.’ అని మరో నెటిజన్ పోస్ట్ చేశారు.
#ImGame REVIEW: A terrific first half elevated by a surprising fantasy element, explosive pre-interval and interval blocks, and a show-stealing performance from Dulquer Salmaan. The second half slows down, shifting into a predictable familiar template with fewer surprises. The… pic.twitter.com/beckv7w3pZ— Lets Cinema (@letscinema) September 3, 2026
‘ఊహించని ఫాంటసీ ఎలిమెంట్ సినిమాకి హైలెట్గా నిలిచింది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్లాక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. దుల్కర్ సల్మాన్ తన నటనతో సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు.
#Imgame : A fantasy thriller from Nahas Hidhayath.DQ shines as Dan John.Myskkin as Villain good.Jakes BGM elevates. Screenplay keeps us hooked from Pre-interval .A banger first half with a decent second half 🔥
Good watch 🏆 💥- (3.5/5) ✅ pic.twitter.com/KMBSRESFDa— ரோமன் 🎦 (@romanjebin) September 3, 2026
Tags : 1