Breaking News

దృశ్యం-3 మూవీ.. ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు: డైరెక్టర్‌

Published on Fri, 09/12/2025 - 18:07

మలయాళంలో తెరకెక్కించిన దృశ్యం.. అన్ని భాషల్లోనూ స‍త్తా చాటింది. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 సైతం అభిమానుల ఆదరణ దక్కించుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్‌ సిరీస్‌లో దృశ్యం-3 కూడా తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ మూవీని ప్రకటించిన దర్శకుడు జీతూ జోసెఫ్‌ స్క్రిప్ట్ పూర్తయిందని తెలిపారు.

అయితే దృశ్యం-3 మూవీకి సంబంధించి క్రేజీ ‍అప్‌డేట్ ఇచ్చారు. ఈ నెలలోనే  చిత్రీకరణ ప్రారంభం కానుందని జీతూ జోసెఫ్ తెలిపారు. అయితే ఆడియన్స్‌కు మాత్రం గట్టి ఝలక్ ఇచ్చారు. ఈ మూవీపై మొదటి రెండు పార్ట్స్‌లా ఎక్కువగా అంచనాలు పెట్టుకోవద్దని సూచించారు. ఈ సినిమా నుంచి ఎక్కువగా ఆశించవద్దని కోరారు.

జీతూ జోసెఫ్ మాట్లాడూతూ.. 'రెండవ భాగం దృశ్యం-2లా ఈ సినిమాను ఆశించవద్దు. అలా ఎక్కువగా ఆశలు పెట్టుకుంటే నిరాశ చెందుతారు. ఇప్పుడు రాబోయే భాగం 'దృశ్యం' చిత్రాల మైండ్ గేమ్‌కు భిన్నంగా ఉండనుంది. దృశ్యం 3 కథాంశాలపై తక్కువ దృష్టి సారించి.. కథలోని మెయిన్‌ పాత్రపై ఎక్కువ దృష్టి పెట్టాం. దృశ్యం 1, 2 సినిమాలతో నేను సంతోషంగా ఉన్నా. 'దృశ్యం 3' కూడా మంచి సినిమా అవుతుంది. బాక్సాఫీస్ గురించి నాకు తెలియదు'అని  వివరించారు. ఈ మూవీతో పాటు జీతూ జోసెఫ్ మరో రెండు ప్రాజెక్టులను తెరెకెక్కిస్తున్నారు. ఆయన డైరెక్షన్‌లో వస్తోన్న మిరాజ్‌ ఈనెల 19న విడుదల కానుంది. అంతేకాకుండా జోజు జార్జ్‌తో 'వలతు వశతే కల్లన్' ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు.

కాగా.. ఈ చిత్రాన్ని మోహన్‌ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో దర్శకుడు జీతూ జోసెఫ్‌ తెరకెక్కించారు. మలయాళంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన దృశ్యం-2 కూడా సక్సెస్‌ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వెంకటేశ్ నటించగా.. భారీ హిట్‌ను సొంతం చేసుకుంది.   హిందీలో అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు. తమిళంలో కమల్‌ హాసన్‌, గౌతమి ప్రధాన పాత్రల్లో నటించారు. 
 

Videos

YSRCP ఎప్పుడూ విజన్ తో ఆలోచిస్తుంది..విజయవాడ-గుంటూరు మధ్య పెడితే..: సజ్జల

రాజధానిపై చంద్రబాబు హాట్ కామెంట్స్

బరువెక్కుతున్న అమీర్..! కారణం అదేనా..?

RK Roja: మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది

ఈ వయసులో నీకెందుకు బాబు.. జూ.ఎన్టీఆర్ కి పార్టీ పగ్గాలు ఇచ్చేయ్

Diarrhea Cases: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 106 మంది

'మిరాయ్’ మూవీ రివ్యూ

చంద్రబాబుకి ఆ రెండంటే గుర్తొచ్చేది వ్యాపారమే

Haryana: కానిస్టేబుల్ ను గంట జైల్లో పెట్టిన కోర్టు

Garam Garam Varthalu: ‪120 ఏళ్లు.. హ్యాపీ బర్త్‌ డే బామ్మ

Photos

+5

రూ.2,700 కోట్ల విలాసం... కానీ తక్కువ ధరకే!! (ఫొటోలు)

+5

మాల్దీవుస్‌లో 'డిజే టిల్లు' బ్యూటీ.. నేహా శెట్టి ఫోటోలు చూశారా?

+5

హైదరాబాద్‌లో తప్పక సందర్శించాల్సిన ఆలయాలు ఇవిగో (ఫొటోలు)

+5

‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

ఆరెంజ్‌ డ్రెస్‌లో అందంగా ఐశ్వర్య రాజేశ్‌ (ఫోటోలు)

+5

యాపిల్ సీఈఓతో అమితాబ్ బచ్చన్ మనవరాలు (ఫొటోలు)

+5

'మిరాయ్'తో మరో హిట్.. ఈ బ్యూటీ ఎవరో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ నటి సుధ, అనిరుధ్, సప్తగిరి (ఫొటోలు)

+5

మతిపోగొడుతున్న అనుపమ అందం (ఫొటోలు)