Breaking News

ఇది నిజంగా వింతే.. సినిమా కోసం కుక్కతో డబ్బింగ్!

Published on Mon, 08/12/2024 - 12:33

సినిమా కోసం నటీనటులు డబ్బింగ్ చెప్పడం ఎప్పుడూ ఉండేదే. కానీ తొలిసారి ఓ కుక్కతో డబ్బింగ్ చెప్పించారు! నమ్మలేకపోతున్నారా? కానీ ఇదే నిజం. 'నను మత్తు గుండా 2' అనే కన్నడ మూవీ కోసం ఇదంతా జరిగింది. స్వయంగా ఈ విషయాన్ని దర్శకుడే బయటపెట్టాడు. కొన్ని ఫొటోల్ని కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇంతకీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే?

(ఇదీ చదవండి: ఓటీటీ ప్రియులకు పండగే.. ఈవారం ఏకంగా 22 చిత్రాలు స్ట్రీమింగ్!)

రీసెంట్ టైంలో కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా లెవల్లో గుర్తింపు తెచ్చకుంటోంది. కేజీఎఫ్, చార్లీ తదితర చిత్రాలు నేషనల్ వైడ్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీ వార్తల్లో నిలిచింది. దీనికి కారణం ఓ సినిమా కోసం కుక్క పాత్రకు డబ్బింగ్ చెప్పించడం. 2020లో థియేటర్లలో రిలీజైన 'నాను మత్తు గుండా' మూవీ హిట్‌గా నిలిచింది. ఆటో డ్రైవర్, గుండా అనే అనాథ కుక్కని పెంచుకోవడం అనే కాన్సెప్ట్‌తో తీశారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ తీస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అయితే సినీ చరిత్రలోనే తొలిసారి కుక్క పాత్ర దానితోనే డబ్బింగ్ చెప్పించారట. లాబ్రాడర్ జాతికి చెందిన సింబా అనే శునకం కీలక పాత్ర పోషించిందని, నేచురాలిటీ కోసం సదరు కుక్కతోనే డబ్బింగ్ చెప్పించామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ త్వరలో రిలీజ్ చేయనున్నారట. ఈ సీక్వెల్ మూవీకి తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ సంగీతమందించడం విశేషం.

(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి