Breaking News

లవ్, సస్పెన్స్‌ ఎంటర్ టైనర్‌గా రమేష్ గోపిల నాల్గో చిత్రం

Published on Sun, 06/06/2021 - 18:02

రమేష్, గోపిల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నాలుగో చిత్రం ఆదివారం పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా నటుడు శోభన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఎస్పీ క్రియేషన్ బ్యానర్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా ప్రారంభోత్సవంలో రచ్చ రవి, హీరో  రామన్, విక్రమ్ , చంద్ర వట్టికూటి, మోహన్ , మధు పగడాల, డాక్టర్ కృష్ణమూర్తి, రాహుల్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా గురించి దర్శకులు  వివరాలు తెలియచేస్తూ ... ‘మేము దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా ఇది. మేము ఇదివరకే హీరో తరుణ్ తో ఇది నా లవ్ స్టోరీ, ఆ తరువాత రెడ్డి గారింట్లో రౌడీయిజం తీశాం,  అది విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఈ మద్యే కన్నడలో ఓ సినిమా చేశాం, అది కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇది మా నాలుగో సినిమా. ఈ చిత్రం ద్వారా శోభన్ ను హీరోగా పరిచయం చేస్తూన్నాం, తాను ఇప్పటికే యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్ లాంటి అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. ఈ సినిమా లవ్, సస్పెన్స్‌ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ రోజు పూజ కార్యక్రమాలతో ప్రారంభించాం. లాక్ డౌన్ ఎత్తివేయగానే .. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం.  ఈ చిత్రానికి సంబందించిన మిగతా నటీనటుల టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’ అని అన్నారు.

#

Tags : 1

Videos

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana

తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ

Photos

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)