Breaking News

అందుకే పవన్‌ కల్యాణ్‌ సినిమా టైటిల్‌ పెట్టాం: నితిన్‌-భరత్‌

Published on Thu, 04/03/2025 - 11:19

‘‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) సినిమా ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి సరదాగా నవ్వుకుంటూ చూసేలా ఉంటుంది’’ అని డైరెక్టర్స్‌ నితిన్‌–భరత్‌ చెప్పారు. ప్రదీప్‌ మాచిరాజు(pradeep Machiraju), దీపికా పిల్లి జంటగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. మాంక్స్‌– మంకీస్‌ బ్యానర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకులు నితిన్, భరత్‌ మాట్లాడుతూ– ‘‘ప్రదీప్‌గారి ఫస్ట్‌ సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ కోసం ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ చేశాం. అప్పుడే ఆయనతో సినిమా తీయాలనుకున్నాం. అలా మేం చెప్పిన కథ ప్రదీప్‌కి నచ్చడంతో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం ఆరంభమైంది. 

ఇది పవన్‌ కల్యాణ్‌ గారి సినిమా టైటిల్‌. కచ్చితంగా పబ్లిసిటీ పరంగా ప్లస్ అవుతుందని అనుకున్నాం. అలాగే కాన్సెప్ట్‌ కూడా టైటిల్‌కి యాప్ట్‌గా ఉండడం వల్లే పవన్‌ కల్యాణ్‌ గారి టైటిల్‌ తీసుకోవడం జరిగింది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌లా రూపొందిన ఈ సినిమాలో వినోదం సందర్భానుసారంగా, ఆర్గానిక్‌గా ఉంటుంది. 

తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలనుకుని, ఆడిషన్స్‌ చేసి, దీపికని తీసుకున్నాం. ప్రదీప్‌గారి ఫ్రెండ్స్‌ ఈ మూవీ నిర్మించారు. రథన్‌గారి అద్భుతమైన సంగీతం, బాల్‌ రెడ్డిగారి విజువల్స్‌ ఆకట్టుకుంటాయి. మా సినిమా మైత్రీ మూవీ మేకర్స్‌కి నచ్చడంతో విడుదల చేస్తున్నారు’’ అన్నారు.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)