Breaking News

కార్తీ, కమల్‌ ప్రాజెక్ట్‌లను కాదని కమెడియన్‌తో సినిమా తీస్తున్న స్టార్‌ డైరెక్టర్‌

Published on Mon, 01/22/2024 - 13:45

హిట్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన దర్శకుడు హెచ్‌.వినోద్‌. అజిత్‌తో వలిమై,తెగింపు చిత్రాలతో పాటు బాలీవుడ్‌ హిట్‌ సినిమా అయిన పింక్‌ చిత్రాన్ని కూడా తమిళ్‌లో వినోద్‌ డైరెక్ట్‌ చేశాడు. కార్తీతో ఖాకీ చిత్రాన్ని తీసి టాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తదుపరి ప్రాజెక్ట్‌ కమలహాసన్‌ కథానాయకుడిగా రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై ఓ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిగాయి. ఇది వ్యవసాయ నేపథ్యంలో రూపొందనుందనే ప్రచారం జరిగింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రం తెరకెక్కించడానికి మరింత సమయం పట్టనుందనే టాక్‌ వినిపిస్తోంది.

కాగా ఇంతకు ముందు నటుడు కార్తీతో ఖాకీ చిత్రానికి సీక్వెల్‌ చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ గురించి ఎలాంటి సమాచారం లేదు. దీంతో నటుడు కార్తీ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమలహాసన్‌ హీరోగా చేసే చిత్రం కూడా వాయిదా పడడంతో హెచ్‌.వినోద్‌ మధ్యలో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇందులో నటుడు యోగిబాబు హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇది రాజకీయ వ్యంగ్యాస్త్రాలతో వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)