Breaking News

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం చూసి స్టోరీ రాసుకున్నా: ఉదయ్‌ శెట్టి

Published on Thu, 05/30/2024 - 20:19

‘భయం, అత్యాశ, కుట్ర అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి. అయితే కొందరిలో కొంత మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు లక్షణాలు కొందరు మనుషులను ఎలాంటి పరిస్థితుల వైపు తీసుకెళ్లాయి అనేది "గం..గం..గణేశా"లో ఆసక్తికరంగా తెరకెక్కించాం’ అన్నారు డైరెక్టర్‌ ఉదయ్ శెట్టి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఆనంద్ దేవరకొండ హీరో. సరసన ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. రేపు(మే 31) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఉదయ్‌ శెట్టి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 
 

→ నేను విజయేంద్రప్రసాద్ గారి టీమ్ లో రైటర్ గా వర్క్ చేసేవాడిని. ఒకసారి హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ టైమ్ లో ఈ స్టోరీ లైన్ ఫ్లాష్ అయ్యింది. నా ఫ్రెండ్, దర్శకుడు అనుదీప్ కేవీ ద్వారా ఆనంద్ దేవరకొండ టీమ్ కు ఈ స్క్రిప్ట్ సినాప్సిస్ పంపించాను. ఆ సాయంత్రమే నాకు ఫోన్ వచ్చింది. వచ్చి ఒకసారి కలవండి అని. నేను వెళ్లి స్క్రిప్ట్ గురించి వాళ్లకున్న డౌట్స్ క్లియర్ చేశాను. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ చేద్దామని ఆనంద్ చెప్పారు. అలా "గం..గం..గణేశా" జర్నీ బిగిన్ అయ్యింది.

→ వినాయకుడి విగ్రహం చుట్టూ తిరిగే కథ ఇది. ఆ విగ్రహం సంపాదించుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటాడు. ఈ సినిమాలో అన్నీ గ్రే క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక హీరోయిన్ ని మాత్రం మంచి క్యారెక్టర్ లో చూపిస్తున్నాం. మరో హీరోయిన్ నెగిటివ్ గా బిహేవ్ చేస్తుంది. అయితే తను బ్యాడ్ కాదు పరిస్థితుల వల్ల అలా ప్రవర్తించాల్సివస్తుంది.

→ ఇటీవల మా మూవీ ప్రివ్యూ చూసిన వాళ్లు వెన్నెల కిషోర్ క్యారెక్టర్ ఇంకాస్త సేపు ఉంటే బాగుండేది అన్నారు. వాళ్లకు అంతగా నచ్చింది. ఇందులో స్పెషల్ గా లవ్ స్టోరి అంటూ ఉండదు. కథ జర్నీలో భాగంగా ఇద్దరు హీరోయిన్స్ వస్తారు. వాళ్లకు కీ రోల్స్ ఉన్నాయి. బాగా నయన్ సారిక, ప్రగతి శ్రీ వాస్తవ బాగా పర్ ఫార్మ్ చేశారు.

→ "గం..గం..గణేశా" సినిమాలో స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటుంది. కథలో నేను నమ్మిన ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ను అలాగే హోల్డ్ చేస్తూ స్క్రీన్ ప్లే సాగుతుంది. ఈ సినిమా మరో రెండేళ్లకు తెరపైకి తీసుకొచ్చినా కొత్తగా ఉంటుంది. అలాంటి స్క్రీన్ ప్లే కుదిరింది.

→ "గం..గం..గణేశా" మేకింగ్ టైమ్ లో ఆనంద్ చాలా సపోర్ట్ చేశాడు. నేను అనుకున్న క్యారెక్టర్ లో బాగా పర్ ఫార్మ్ చేశాడు. ఎడిట్ టేబుల్ మీద ఆనంద్ పర్ ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు హ్యాపీగా అనిపించింది. డైలాగ్ డెలివరీ, టైమింగ్, రియాక్షన్స్ చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు ఆయన పర్ ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. కమర్షియల్ హీరోకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఆయన క్యారెక్టర్ లో కనిపిస్తాయి.

→ నేను పూరి జగన్నాథ గారిని చూసి ఇన్స్ పైర్ అయ్యాను. అయితే రాజమౌళి గారి సినిమాల్లోని డ్రామా చాలా ఇష్టం. మనకు సినిమా చూసేప్పుడు డ్రామా మన మనసులకు రీచ్ అవుతుంది. అలాంటి యాక్షన్ డ్రామా మూవీస్ చేయాలని ఉంది. నా నెక్ట్ మూవీ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)