ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్‌

Published on Mon, 05/01/2023 - 11:38

ఇతర రంగాల కంటే సినీ రంగంలో వారసత్వం అనేది కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. ఇక్కడ నటీనటుల వారసులే కాకుండా దర్శకుడు, నిర్మాతల వారసులు కూడా రంగ ప్రవేశం చేస్తున్నారు. అలా ప్రముఖ దర్శకుడు శంకర్‌ వారసురాలిగా ఆయన కూతురు అదితి శంకర్‌ కథానాయకిగా విరుమాన్‌ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ఈ హైటెక్‌ సిటీ బ్యూటీ పక్కా గ్రామీణ యువతి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలా చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుమల్లేల చేసుకుంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా మా వీరన్‌ చిత్రంలో నటిస్తోంది.

(చదవండి: చైతన్య మాస్టర్‌ ఆత్మహత్య.. శ్రద్దా దాస్‌, శేఖర్‌ మాస్టర్‌ ఎమోషనల్‌)

విశేషం ఏంటంటే ఈ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. అలా నటి ఆదితి శంకర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. తాజాగా మరికొన్ని కొత్త చిత్రాలను కమిట్‌ అయిన ఈమె తరచూ సోషల్‌ మీడియాలో కనిపించే ప్రయత్నం చేస్తోంది. అలా తాజాగా ఆమె తన తండ్రి దర్శకత్వం వహించిన చిత్రంలోని ఓ పాటకు డాన్స్‌ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

దర్శకుడు శంకర్‌ ఇంతకుముందు విజయ్‌, శ్రీకాంత్‌, జీవ హీరోలుగా నన్భన్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో నటి ఇలియానా కథానాయకి. కాగా ఆ చిత్రంలో విజయ్‌ ఇలియానాలపై చిత్రీకరించిన చిల్లీ టెల్లీ అనే పాట మంచి హిట్‌ అయ్యింది. కాగా ఆ పాటకు నటి అదితి శంకర్‌ చాలా ఫాస్ట్‌గా డాన్స్‌ చేసింది. దాన్ని వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు తెగ వైరల్‌ అవుతుంది.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)