Breaking News

సలార్‌లో లేనిది ‘బబుల్‌గమ్‌’లో ఉంది: దర్శకుడు

Published on Sat, 12/23/2023 - 16:22

‘సలార్‌ సినిమాకి హిట్‌ టాక్‌ రావడం సంతోషంగా ఉంది. వచ్చేవారం(డిసెంబర్‌ 29) 'బబుల్‌గమ్' సినిమా రిలీజ్‌ కాబోతుంది. సలార్‌లో లేని కంటెంట్‌ మా సినిమాలో ఉంది. మా సినిమాలో లేని కంటెంట్‌ సలార్‌లో ఉంది(నవ్వుతూ..). కాబట్టి ప్రభాస్‌ సినిమా థియేటర్స్‌లో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆడియన్స్‌కి నచ్చితే రెండు సినిమాలను చూస్తారు. ‘బబుల్‌గమ్‌’ అందరికి కనెక్ట్‌ అయ్యే సినిమా. కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందనే నమ్మకం మాకు ఉంది’ అని దర్శకుడు రవికాంత్ పేరేపు  అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల కొడుకు రోషన్‌ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘బబుల్‌గమ్‌’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రవికాంత్‌ పేరేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► ‘క్షణం’ తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. లాక్ డౌన్ కారణంగా యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొత్తవాళ్ళతో చేయడానికి 'బబుల్‌గమ్' కథ రాశాను. రోషన్ నాకు ముందే తెలుసు. తను హీరోగా పరిచయం అవుతున్నారని తెలిసి రోషన్ కలిశాను. ఈ కథకు తను పర్ఫెక్ట్ ఫిట్ అనిపించాడు. తర్వాత  మా జర్నీ మొదలైయింది. 

 ► ఇది కొత్తవాళ్ళతోనే చేయాల్సిన కథ. 22 ఏళ్ల తర్వాత కాలేజ్ పూర్తి చేసుకొని రియల్ వరల్డ్ లోకి అడుగుపెడతాం. అప్పటి వరకూ మన ఫ్యామిలీ, పేరెంట్స్ మనల్ని ప్రోటక్ట్ చేస్తారు. ఒక్కసారి మన ప్యాషన్ ని వెదుక్కుంటూ బయటికి వెళ్ళినపుడు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ క్రమంలో  ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలి ?  డబ్బులు వుంటే సరిపోతుందా ? మనకి ఇష్టమైనది చేయాలా?  ఇలా చాలా కన్ఫ్యుజన్స్ వుంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా జీవితంలో ప్రేమ వస్తే ఎలా డీల్ చేస్తాం.. ఇలాంటి కథకు కొత్తవాళ్ళు వుంటేనే బెటర్ అనిపించింది.

► ఇది ప్రధానంగా ప్రేమకథ. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇది రాక్ స్టార్ లా ఉంటుందా ? లేదా ఒక మ్యుజిషియన్ ఫిల్మ్ లా వుంటుందా అని అడిగారు. అయితే ఇది ప్రేమకథ ప్రధానంగా వుండే రిలేషన్ షిప్ డ్రామా.

► రోషన్ ఫెంటాస్టిక్. ట్రైలర్ లో చూసింది పది శాతమే. సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. రోషన్, మానస ఇద్దరూ చాలా చక్కగా నటించారు. అలాగే ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా చక్కని ప్రతిభ కనపరిచారు.      

► మానస తెలుగమ్మాయి. చాలా అద్భుతంగా నటించింది. తనకి తెలుగు అర్ధం కావడం వలన మన రైటింగ్ లోని సబ్ టెక్స్ట్ కూడా తనకి అర్ధమౌతుంది. దీంతో మరింత ఈజీ అయ్యింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. దీంతో నేటివిటీ ఇంకొంచెం బిలీవబుల్ గా వుంటుంది.

►ప్రస్తుతానికి నా దృష్టి 'బబుల్‌గమ్' విడుదలపై ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాను.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)