Breaking News

సీరియల్స్‌కు సినిమాకు తేడా అదే : దర్శకుడు

Published on Tue, 09/19/2023 - 16:57

సీరియల్స్‌కు లేడీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉంటుంది. వారు దర్శకుడు, టెక్నీషియన్లు ఎవరనేది పట్టించుకోరు. కానీ ప్రతి రోజు మా సీరియల్‌ చూస్తారు. సినిమా అలా కాదు. ఒక్క హిట్‌ పడిందంటే చాలు మంచి ఫాలోయింగ్‌, పేరు వస్తుంది. సీరియల్‌కు ఉన్నన్ని కష్టాలు సినిమాకు ఉండవు’అని దర్శకుడు  రాము కోన‌ అన్నారు. పలు సీరియళ్లకు దర్శకత్వం వహించిన రాము.. `రుద్రంకోట‌`అనే సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇది అతనికి తొలి సినిమా. సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత స‌మ‌ర్ప‌కులుగా వ్య‌వ‌హిరిస్తూ ఓ కీల‌క పాత్ర‌లో పోషిస్తున్నారు. సెప్టెంబర్‌ 22న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో రాము తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► నేను  2001లో  న‌టుడు కావాల‌ని  ఇండ‌స్ట్రీకి వ‌చ్చాను.  చాలా ప్ర‌య‌త్నాలు చేశాను కానీ వ‌ర్క‌వుట్  అవ్వ‌లేదు. ఆ త‌రుణంలో ఒక మేక‌ప్ మ్యాన్ ద్వారా `ప‌ద్మ‌వ్యూహం`సీరియ‌ల్ కు కొన్ని రోజులు  ప‌ని చేశాను.  ఆ త‌ర్వాత కొన్ని ప్రాబ్ల‌మ్స్ వ‌ల్ల అక్క‌డ కూడా మానేశాను.  ఇలా కాద‌ని మ‌ద్రాసు వెళ్లాను. అక్క‌డ మిత్రుడి ద్వారా డైరక్ట‌ర్ సురేష్ గారి వ‌ద్ద ఒక సీరియ‌ల్ కు అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ చేరాను. అలా ఆయ‌న ద‌గ్గ‌ర చాలా వ‌ర్క్ నేర్చుకున్నా. ఆ త‌ర్వాత ప్రామ్ట‌ర్ గా కొన్ని సీరియ‌ల్స్ కు ప‌ని చేశాను. అలా నా కెరీర్ ప్రారంభ‌మైంది. ఇప్ప‌టి వ‌ర‌కు అన్ని మేజ‌ర్ టీవీ ఛాన‌ల్స్ లో హిట్ సీరియ‌ల్స్ డైర‌క్ట్ చేశాను. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు  ఐదు వేల‌కు పైగా ఎపిసోడ్స్  డైర‌క్ట్ చేశాను. ఆ స‌మ‌యంలోనే `రుద్రంకోట‌` సినిమా డైర‌క్ట్ చేసే అవ‌కాశం వ‌చ్చింది.

► రుద్రంకోట ద‌గ్గ‌ర జ‌రిగిన కొన్ని య‌థార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ చిత్రం చేశాము.  శ్మ‌శాన వాటిక‌లో పెరిగి పెద్దైన ఓ యుకుడి ప్రేమ‌కథా చిత్రం. భ‌ద్రాచలం ద‌గ్గ‌ర రుద్రంకోట అనే ఊరి నేప‌థ్యంలో క‌థ న‌డుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ చూపించ‌ని అంశాల‌ను మా చిత్రంలో చూపిస్తున్నాము. ఇందులో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే అంశాలుంటాయి.  ల‌వ్ అండ్ ల‌స్ట్ తో సాగే యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ అని చెప్పొచ్చు. అండ‌ర్ కరెంట్ గా మంచి సందేశం కూడా అందిస్తున్నాం. అదేంటో సినిమాలో చూస్తే అర్థ‌మ‌వుతుంది.

► ఇందులో లీడ్ రోల్ లో  సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌లిత గారు న‌టించారు. కోట‌మ్మ పాత్ర‌లో త‌ను న‌టించిన తీరు అద్భుతం.  అలాగే   హీరోగా రుద్ర న‌టించాడు. త‌న‌కు ఇది తొలి సినిమా అయినా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా న‌టించాడు. అమ్మాయిలంటే గిట్ట‌ని పాత్ర‌లో త‌ను ఒదిగిపోయాడు. అలాగే  హీరోయ‌న్స్  శ‌క్తి, విభీష ఇద్ద‌రూ పోటీ ప‌డి న‌టించారు. ప్ర‌తి పాత్ర సినిమాకు కీల‌కంగా ఉంటుంది.

► జ‌య ల‌లిత గారు చేసిన కోటమ్మ పాత్ర సినిమాకు హైటెట్. అలాగే మ్యూజిక్ కూడా మ‌రో హైలెట్ గా నిలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌య‌లలిత గారితో నేను చాలా సీరియ‌ల్స్ కు ప‌ని చేశాను. ఆ అభిమానంతో నేను త‌న పేరు స‌మ‌ర్ప‌కురాలిగా వేసుకున్నాను. జ‌య‌ల‌లిత గారు మా సినిమాకు ఎంతో స‌పోర్ట్ చేశారు.

► ద‌ర్శ‌కుడు గా నాకు ఆద‌ర్శం రాజ‌మౌళి గారు. ఆయ‌న కూడా  మొద‌ట `శాంతి నివాసం` అనే సీరియల్ చేసారు. ఆ త‌ర్వాత సినిమాలు డైర‌క్ట్ చేసి...తెలుగు సినిమాను ఆస్కార్ స్థాయికి తీసుకెల్లారు. ఆయ‌న ఆద‌ర్శంతోనే సీరియ‌ల్ నుంచి నేను కూడా సినిమాల వైపు వ‌చ్చాను.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)