Breaking News

The Ghost: నాగ్‌ కోసమే కథ రాశా.. రొమాన్స్‌ ఉంటుంది: ప్రవీణ్‌ సత్తారు

Published on Sun, 10/02/2022 - 03:55

‘‘నా దృష్టిలో సినిమా తీయడం అంటే సినిమా చరిత్రలో ఓ పేజీ రాయడంలా భావిస్తాను. అలా ఆ చరిత్రలో ‘ది ఘోస్ట్‌’ ఓ పేజీ. వెయ్యి సంత్సరాల తర్వాతే కాదు.. మనం చనిపోయిన తర్వాత కూడా సినిమా చరిత్రలో ఆ పేజీ ఉంటుంది. అందుకే ఈ పేజీని చాలా జాగ్రత్తగా రాయలన్న భయం, బాధ్యత ఉంటే ప్రతి సినిమా బాగుంటుంది’’ అన్నారు దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు. నాగార్జున హీరోగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది ఘోస్ట్‌’. సునీల్‌ నారంగ్, శరత్‌ మరార్, రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్‌ సత్తారు చెప్పిన విశేషాలు.

► నాగార్జునగారి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని ‘ది ఘోస్ట్‌’ కథ రాశాను.. నాగార్జునగారు అద్భుతంగా చేశారు. ఇంటర్‌పోల్‌ డిపార్ట్‌మెంట్‌ నుంచి రిటైర్‌ అయిన ఆఫీసర్‌ విక్రమ్‌ పాత్ర చేశారు నాగార్జునగారు. ఈ చిత్రంలో 12 యాక్షన్‌ సీక్వెన్సెస్‌ ఉన్నాయి. ఎమోషన్స్‌ కూడా ఉన్నాయి. సినిమాలోని చెల్లి, మేనకోడలు సెంటిమెంట్‌ ఆడియన్స్‌ను మెప్పిస్తుంది. రొమాన్సూ ఉంది. 

► నాకు ‘గరుడవేగ’ సినిమా ఫ్లస్‌ అయ్యిందనే భావిస్తున్నాను. ఈ విషయంలో జీవితా రాజశేఖర్‌గార్లకు ధన్యవాదాలు. నేను మూడు సినిమాలు నిర్మించాను. సినిమాలో మంచి
కంటెంట్‌ ఉన్నప్పటికీ దాన్ని ఆడియన్స్‌కు రీచ్‌ అయ్యేలా చేయడం అనేది కొంచెం కష్టమే. నిర్మాతల కష్టాలు నాకు తెలుసు. నా తర్వాతి చిత్రం వరుణ్‌ తేజ్‌తో ఉంది. ఈ నెల 10న  యూకేలో ఆ సినిమా షూటింగ్‌ ఆరంభిస్తాం. అలాగే ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేస్తున్నాను.

► పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్‌ను చూసే సినిమా చూడాలా? వద్దా అని ఆడియన్స్‌ డిసైడ్‌ చేసుకుంటున్న రోజులువి. సినిమా స్టాండర్డ్స్‌ విషయంలో తెలుగు ప్రేక్షకుల ఆలోచనలు మారాయి. ప్రేక్షకులను ఎంగేజ్‌ చేయడం అంటే ఎంటర్‌టైన్‌ చేయడమే. థియేటర్స్‌లో ఆడియన్స్‌ సినిమా చూస్తున్నప్పుడు వారు తమ మొబైల్‌ ఫోన్స్‌ మెసేజ్‌లను చెక్‌ చేసుకోనంత వరకు స్క్రీన్‌ పై ఏ జానర్‌ సినిమా ఉన్నా అప్పుడు అది హిట్టే.

హిందీలో రిలీజ్‌ చేస్తాం – సునీల్‌ నారంగ్‌
‘ది ఘోస్ట్‌’ సినిమాను హిందీలో కూడా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ నెల 7న రిలీజ్‌ అవుతుంది. ముందుగా హిందీ రిలీజ్‌ ప్లాన్‌ చేయలేదు. ఆ తర్వాత చేశాం. నాగార్జునగారు చాలా బాగా నటించారు. ప్రవీణ్‌ సత్తారు భవిష్యత్‌లో పెద్ద దర్శకుడు అవుతాడు. కోవిడ్‌ వల్ల అనుకున్నదాన్ని కన్నా సినిమా బడ్జెట్‌ కాస్త పెరిగింది.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)