5 రోజులుగా దూసుకెళ్తున్న 10 కొత్త కంపెనీలు.. ఇన్వెస్టర్లకు లాభాల పంట!
Breaking News
అందుకే అమ్మాయిల గురించి బోల్డ్‌గా చూపించా : 'ఐ హేట్ మ్యారేజ్’ డైరెక్టర్
Published on Thu, 11/26/2026 - 14:14
సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'ఐ హేట్ మ్యారేజ్'. ఆర్య సినిమా పతాకంపై మాదం దయానంద్, కార్తీక్ వెంపటి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.రేపు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు పరమేష్ రేణు కుంట్ల గురువారం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ 2002లో దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి దగ్గర రచయితగా జాయిన్ అయ్యాను. సానా యాదిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన అభిమాని సినిమాకు నేను కథా రచయితను. ఆ తరువాత చాలా సినిమాలకు రచయితగా పనిచేశాను. సంపత్ నంది దగ్గర ఓ సినిమాకు రచయితకు పనిచేశాను.
→ గతంలో హీరో రవితేజకు కూడా కథ చెప్పాను. కథ నచ్చింది.. కానీ దర్శకత్వం ఇవ్వమని అన్నారు... 2011 నుంచి దర్శకత్వం చేద్దామని ట్రయిల్స్‌లో ఉన్నాను.. పెద్ద హీరోలు డేట్స్ ఇవ్వారని తెలిసి చిన్న సినిమాతో పరిచయం అవుదామని అనుకున్నాను. ఫైనల్ ఐ హేట్ మ్యారేజ్‌తో దర్శకుడిగా నా తొలి ప్రాజెక్ట్‌ను చేశాను.
→ నా కథలు ఊహించి రాసినట్టుగా ఉండవు. నాదొక డిఫరెంట్ కథలు.. రెగ్యులర్ లైఫ్‌లో ఎంతమంది కొట్లాడుతున్నావు.. రెగ్యులర్ సమాజంలో చూసే పక్కింటి కుర్రడు..మనం సమాజంలో చూసే అమ్మాయిలే నాకథలో ఉంటారు.. మన కథలో ఉంటారు.. అందుకే నా కథలు అందరూ దర్శకులకు సెట్ కావు.
→ ఐ హేట్ మ్యారేజ్ కథను 2021లో అనుకున్నాను.. ఈ మధ్య అమ్మయిలు సమాజంలో బాయ్ ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసి కూడా ఇంట్లో తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే చేసుకుంటున్నారు.. అసలు ఎందుకిలా జరుగుతుంది? అమ్మాయిలకు లవ్‌మీద క్లారిటీ లేదా? పెళ్లి మీద నమ్మకం లేదా? తల్లిదండ్రుల మాటకు గౌరవం ఇస్తున్నారా అనేది అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో రీసెర్చ్ చేసి మరీ ఈ కథను రాశాను.. ఇందులో తేలింది అంటే మ్యారేజ్ అంటే ఇష్టం లేని అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారని అనిపించింది. తల్లిదండ్రుల కోసమే మ్యారేజ్ చేసుకుంటున్నాం అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
→ ఎమోషన్ లేని ఓ అబ్బాయితో తన సరదాలను తీర్చుకోవాలనే మైండ్‌సెట్ ఉన్న అమ్మాయి.. ఎలాంటి ఎమోషన్ లేని హీరో . ఈ ఇద్దరి కథ ఇది. అయితే ఇలాంటి అమ్మాయితో అనుకోకుండా ఎమోషనల్‌గా ఫీలయ్యి.. లవ్ చేయడం మొదలుపెడతాడు.. అమ్మాయికి కూడా ఇతని లవ్‌లో పడుతుంది. అప్పుడ ఏం జరిగింది. అనేది కథ.. సినిమాలో బోల్డ్‌గా చూపించాలని కాదు.. అలాంటి వారు మన సమాజంలో ఉన్నారు. అందుకే బోల్డ్‌గా చూపించాను.
→ ప్రజెంట్ జెన్‌జీ బ్యాచ్ ఆలోచన ఎలా ఉంటుంది.. జెన్‌జీ బ్యాచ్.. పేరెంట్స్ మధ్య ఉంటే సంఘర్షణను.. సమాజం గురించి తల్లిదండ్రుల ఆలోచన ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలోచూపించాను. ఈ సినిమా విడుదల తరువాత అన్ని పాత్రల గురించి మాట్లాడుకుంటారు.
→ కొత్త సినిమా విషయాలకొస్తే.. హైదారాబాద్ మాస్ బస్గీలో జరిగే ఓ కథ రెడీగా ఉంది.
Tags : 1