Breaking News

ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం: నీరజ కోన

Published on Wed, 10/08/2025 - 03:53

‘‘స్కూల్‌ డేస్‌ నుంచే నాకు రైటింగ్‌ అంటే ఇష్టం. కథలు చెప్పడం ఇంకా ఇష్టం. అలా కొన్ని కథలు రాసుకున్నాను. నా స్నేహితులు రానా, నాని వంటివారు బాగా సపోర్ట్‌ చేశారు. ఒక దశలో సినిమా కథ రాయగలననే నమ్మకం కలిగింది. అలా రాసుకున్న కథే ఈ ‘తెలుసు కదా’’ అని అన్నారు నీరజ  కోన. సిద్ధు  జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘తెలుసు కదా’. శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ప్రముఖ స్టైలిస్ట్‌ నీరజ  కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో ఆమె పంచుకున్న విశేషాలు...

⇒ ‘తెలుసు కదా’ మంచి ప్రేమ కథా చిత్రం. ప్రేమకథతోపాటు ఒక కాంప్లెక్స్‌ సిటీ కూడా ఉంది. నేను మహిళా దర్శకురాలిని కనుక ఈ సినిమా కథను మహిళా దృష్టి కోణంలో చెప్పలేదు. నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫస్ట్‌ సిట్టింగ్‌లోనే నా కథను సిద్ధు జొన్నలగడ్డ ఓకే చేయడం, దర్శకురాలిగా నాకు అవకాశం రావడం నా లైఫ్‌లో మెమొరబుల్‌ మూమెంట్‌. 

⇒ సిద్ధుపై టిల్లు క్యారెక్టర్‌ షాడో ఉండొచ్చు. కానీ, తను మంచి పెర్ఫార్మర్‌. ఈ సినిమాలో స్క్రీన్ పై తను పోషించిన వరుణ్‌పాత్రని మాత్రమే ఆడియన్స్ చూస్తారు. కథలో కాంప్లెక్స్‌గా ఉండే రాగపాత్ర కోసం శ్రీనిధిని తీసుకున్నాం. మెచ్యూర్డ్‌ క్యారెక్టర్‌ అంజలిపాత్రకి రాశి సరిపోయారు. టీజీ విశ్వప్రసాద్‌గారు లేకపోతే ఈ సినిమాయే లేదు. ఈ సినిమా ప్రయాణంలో కృతీ ప్రసాద్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. ఈ సినిమాకి తమన్  మ్యూజిక్‌ బ్యాక్‌ బోన్ .

⇒ నేను ఏ సినిమాకి కూడా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేయలేదు. కానీ, కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నా కెరీర్‌ స్టార్టింగ్‌లోనే ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, విజయ్, సూర్య వంటి టాప్‌ హీరోలు చేసిన సినిమాలకు పని చేశాను. అదే నా లెర్నింగ్‌ స్కూల్, ఎక్స్‌పీరియన్స్. ప్రతిరోజూ నేర్చుకోవడం నాకు ఇష్టం. ఇప్పటికీ నేను ప్రతిదీ నా తొలి సినిమా అన్నట్లుగా భయం, టెన్షన్ తో పనిచేస్తుంటాను. దర్శకురాలిగా నా తర్వాతి చిత్రం కూడా లవ్‌స్టోరీనే. త్వరలోనే వివరాలు చెబుతాను.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)