Breaking News

‘అరి’ కథతో పుస్తకం తీసుకొస్తున్నాం : దర్శకుడు జయశంకర్‌

Published on Tue, 10/14/2025 - 19:16

వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రంఅరి. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ తెరకెక్కించిన చిత్రం ఇటీవలె ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ని సంపాదించుకుంది. అరి షడ్వర్గాలను కాన్సెప్ట్‌గా తీసుకుని, ఇంత వరకు ఎవ్వరూ టచ్ చేయని ఈ పాయింట్‌ని సినిమాలో చూపించాడు దర్శకుడు శంకర్‌.

చివర్లో కృష్ణుడి ఎంట్రీ, అరి షడ్వర్గాల గురించి ఆయన ఇచ్చే సందేశం అందరినీ ఆకట్టుకుంది. మంచి సందేశాత్మకంగా చిత్రంగా అరిని మలిచారంటూ ఆడియెన్స్ దర్శకుడి మీద ప్రశంసల్ని కురిపించారు. ఇక మీడియా, సోషల్ మీడియా, క్రిటిక్స్ ఇలా అందరూ కూడా చివరి 20 నిమిషాల గురించి మాత్రం ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలోనూ అరిపై పాజిటివ్ కామెంట్లే కనిపిస్తున్నాయి. అలా డివైన్ ట్రెండ్‌ను ఫాలో అవుతూ అరి చిత్రం ఆడియెన్స్ గుండెల్లోకి వెళ్లిపోయింది. అరి షడ్వర్గాలను ప్రధాన అంశంగా తీసుకుని, ఆరు పాత్రలతో దర్శకుడు సమాజానికి మంచి సందేశాన్ని ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంది.

తాజాగా నిర్వహించిన సక్సెస్మీట్లో దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ - "అరి" సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మంచి రివ్యూస్, రేటింగ్స్ ఇచ్చిన మీడియా వారికి థ్యాంక్స్. మూవీకి స్లోగా ఓపెనింగ్స్ వచ్చి పికప్ అవుతుందని ముందే అనుకున్నాం. అయితే రెండో రోజునే శ్రీకాంత్ అయ్యంగార్ ఇష్యూ వల్ల మా సినిమా పోస్టర్స్ ను థియేటర్స్ దగ్గర చించివేయడం చూసి బాధగా అనిపించింది. ఎంతో కష్టపడి చేసిన సినిమాకు ఇలా జరుగుతుందేంటని ఇబ్బందిపడ్డాం. ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. థర్డ్ డే నుంచి అరి సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల సందడి కనిపించింది. అరిషడ్వర్గాల గురించి ఎంతోమంది గొప్పవాళ్లు చెబుతూ వచ్చారు గానీ వాటికి పరిష్కారం చూపించలేదు. ఈ ఆలోచనతోనే అరి చిత్రాన్ని రూపొందించాను. నేను చూసిన సినిమాలు కొన్ని ఇలాంటి కాన్సెప్ట్ తో చిత్రాన్ని చేసేందుకు స్ఫూర్తినిచ్చాయి. ఈ సినిమా కథతో త్వరలోనే పుస్తకాన్ని తీసుకొస్తున్నాం. మా సినిమా ఇప్పుడే ఓటీటీలోకి రావడం లేదు. థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యాక ఓటీటీ డేట్ అనౌన్స్ చేస్తాంఅన్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)