Breaking News

Bhimaa: ఎమోషన్‌.. ఎలివేషన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సందేశం

Published on Thu, 03/07/2024 - 10:40

‘‘సినిమాలో ఏ మాత్రం ల్యాగ్‌ ఉన్నా సరే థియేటర్స్‌లో ఆడియన్స్‌ మొబైల్‌ ఫోన్స్‌ చూస్తున్నారు. సో... ఆడియన్స్‌ను ఎంగేజ్‌ చేయాలంటే మంచి స్క్రీన్‌ ప్లే ఉండాలి. ‘భీమా’లో గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ ప్లే ఉంది. ఎలివేషన్‌.. ఎమోషన్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. సెమీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్‌తో ‘భీమా’ చిత్రంలో ఓ సామాజిక సందేశం కూడా ఉంది’’ అన్నారు దర్శకుడు ఎ. హర్ష.

గోపీచంద్‌ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్‌ నిర్మించిన చిత్రం ‘భీమా’. ఈ నెల 8న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో ఎ.హర్ష మాట్లాడుతూ– ‘‘కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ‘భీమా’ చిత్రం సహనిర్మాత శ్రీధర్‌గారు ఓ కథ ఉంటే చెప్పమన్నారు. ఆన్‌లైన్‌లో గోపీచంద్‌గారికి ‘భీమా’ స్టోరీలైన్‌ చెప్పాను. ఆ తర్వాత ఫుల్‌ స్టోరీ చెప్పాను. ఆయనకు నచ్చింది. చిన్న మార్పులు సూచించారు. ఆ తర్వాత సెట్స్‌పైకి వెళ్లాం. గోపీచంద్‌గారు అద్భుతమైన నటుడు. ఆయన చేసిన ‘భీమా’ పాత్రను ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు. రాధామోహన్‌గారు నిర్మించిన ‘బెంగాల్‌ టైగర్‌’కు కొరియోగ్రాఫర్‌గా చేశాను. ఇప్పుడు ఆయన నిర్మించిన సినిమాకు దర్శకత్వం వహించడం హ్యాపీ’’ అన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)