Breaking News

బ్లాక్‌ బస్టర్‌.. రాసిపెట్టుకోండి

Published on Tue, 01/10/2023 - 01:17

‘‘వీరసింహా రెడ్డి’కి తమన్‌ అత్యద్భుతమైన పాటలు ఇచ్చారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇందులో అన్ని పాటలు రామజోగయ్య శాస్త్రిగారు రాశారు. ‘మాస్‌ మొగుడు..’ చివర్లో తీసిన పాట. అప్పుడు మా కెమెరామేన్‌ రిషి పంజాబీ డిఐ వర్క్‌లో వుండటం వలన నా ‘క్రాక్‌’ సినిమా కెమెరామేన్‌ జీకే విష్ణు ఈ పాటని చేశారు. బాలయ్యబాబుని చాలా కలర్‌ఫుల్‌గా చూపించారు’’ అన్నారు గోపీచంద్‌ మలినేని.

నందమూరి బాలకృష్ణ హీరోగా శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. సోమవారం ఈ చిత్రంలోని ‘మాస్‌ మొగుడు..’ పాట ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తమన్‌ స్వరపరచిన ఈ పాటకు  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, మనో, రమ్య బెహరా ఆలపించారు.

ఈ కార్యక్రమంలో గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఒంగోలులో జరిగిన వేడుకలో విడుదల చేసిన థియేట్రికల్‌ ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే. సినిమాలో మామూలుగా ఉండదు. ‘వీరసింహా రెడ్డి’ ష్యూర్‌ షాట్‌ బ్లాక్‌ బస్టర్‌... రాసిపెట్టుకోండి’’ అన్నారు. రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ– ‘‘నేను బాల కృష్ణగారికి అభిమానిని. ఈ చిత్రానికి సింగిల్‌ కార్డ్‌ రాసే చాన్స్‌ ఇచ్చిన గోపీచంద్‌ మలినేనికి, మైత్రీ మూవీ మేకర్స్‌కి కృతజ్ఞతలు. అన్ని పాటలూ అద్భుతంగా ఉంటాయి. బాలకృష్ణగారి మార్క్‌ ఫైర్‌ బ్రాండ్‌ సినిమా ఇది’’ అన్నారు.
 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)