Breaking News

నెమలి కనబడటం నాకో పాజిటివ్‌ సైన్‌: డైరెక్టర్‌ జ్ఞానసాగర్‌

Published on Wed, 06/12/2024 - 11:00

సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో సుమంత్‌ జి. నాయుడు నిర్మించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘హరోం హర’. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో జ్ఞానశేఖర్‌ మాట్లాడుతూ –‘‘కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ ఫిల్మ్‌ ఇది. కుప్పంలో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పని చేసే ఓ మామూలు కుర్రాడు సుబ్రహ్మణ్యం ఎందుకు గన్స్‌ మేకింగ్‌లో ఇన్‌వాల్స్‌ కావాల్సి వచ్చింది? ఆ తర్వాత అతని జీవితం ఏ విధంగా మలుపు తిరిగింది? అన్నదే ఈ సినిమా కథ. 

ఈ కథలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. మంచి ఫాదర్‌ ఎమోషన్‌ కూడా ఉంది. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుణ్ణి. అందుకే ఈ సినిమాకు ‘హరోం హర’ టైటిల్, హీరోకు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాను. ఈ సినిమా షూటింగ్‌ జరిగిన ప్రతి లొకేషన్‌లో మాకు నెమలి కనిపించింది. దీన్ని ఓ పాజిటివ్‌ సైన్‌గా తీసుకున్నాను. సుధీర్‌బాబుగారు అద్భుతంగా నటించారు. కథని నమ్మి, గ్రాండ్‌గా నిర్మించిన నా ఫ్రెండ్‌ సుమంత్‌కి ధన్యవాదాలు. 

ఈ సినిమాను ముందు పాన్‌ ఇండియాగానే అనుకున్నాం. అయితే ఇతర భాషల్లో డైలాగ్స్‌ సరిగ్గా కుదరలేదనిపించింది. నాకు నాలుగు భాషలు వచ్చు. నేనే కూర్చుని, పర్ఫెక్ట్‌గా చేయించాలంటే సినిమా రిలీజ్‌కు చాలా టైమ్‌ పడుతుంది. అందుకే ΄ాన్‌ ఇండియా రిలీజ్‌ వద్దనుకున్నాం’’ అన్నారు.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)