Breaking News

బూట్లలో ఉప్పు వేసుకొని అక్కడ షూటింగ్‌ చేశాం: ఢైరెక్టర్‌

Published on Sat, 07/08/2023 - 18:04

చైనా బోర్డ‌ర్‌లో ఎన్నో వ్యయ‌ప్ర‌యాస‌ల‌కోర్చి భారతీయన్స్‌ సినిమా షూటింగ్‌ చేశాం. వ‌ర్షాలు కురిసి, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డి ఎప్పుడు షూటింగ్ ఆగిపోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఈ సినిమాను పూర్తి చేశాం. జీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ‘శ్మీర్ ఫైల్స్ ’దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ‘భార తీయన్స్’ చిత్రంపై ప్రశంసలు కురిపించడం మేము పడ్డ కష్టం అంతా మర్చిపోయేలా చేసింది’ అని ప్రముఖ రచయిత దీన‌రాజ్‌ అన్నారు. ప్రేమించుకుందాం రా, ప్రేమంటే ఇదేరా, క‌లిసుందాం రా వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌కు క‌థా ర‌చ‌యిత‌గా పనిచేసిన దీనరాజ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘భారతీయన్స్‌’. జులై 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

భారతీయన్స్‌ సినిమా కోసం చాలా కష్టపడ్డాం.  డ్రోన్స్‌తో షూట్ చేయ‌డానికి, బాంబ్ పేలుళ్లు జరపడానికి, అడ‌వుల్లో షూటింగ్‌కు ప్ర‌భుత్వం నుంచి ప్ర‌త్యేక అనుమతులు తీసుకున్నాం.ఒక్కోసారి మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే లైటింగ్ ఫెయిల్ అయి షూటింగ్ చేయ‌లేక‌పోయేవాళ్ళం. చిత్ర యూనిట్ స‌భ్యుల‌కు ఈశాన్య రాష్ర్టాల ఫుడ్ స‌రిప‌డ‌క‌పోవ‌డంతో ఆరోగ్య స‌మ‌స్య‌లు ఎదుర‌య్యేవి. కొండ‌చ‌రియ‌లతోపాటు.. చెట్లు విరిగి మా కార్ల‌మీద ప‌డ‌డంతో కొందరు యూనిట్ సభ్యులు బ‌తుకు జీవుడా అని దొరికిన వాహ‌నాన్ని ప‌ట్టుకుని హైద‌రాబాద్ వ‌చ్చేశారు.

అడ‌వుల్లో షూటింగ్ చేస్తున్న‌ప్పుడు జ‌ల‌గ‌లు మా కాళ్ల‌ని ప‌ట్టుకుని సైలెంట్‌గా ర‌క్తాన్ని పీల్చేవి. స‌మీప గ్రామాల నుంచి ఉప్పు బ‌స్తాలు తెప్పించి... చెప్పుల్లో, బూట్ల‌లో ఉప్పు వేసుకుని షూటింగ్ కొన‌సాగించాం. సిక్కిం, సిలిగురి అడ‌వుల్లో దోమ‌ల్లాంటి కీట‌కాలు ఎగురుతూ ముఖం మీద డైరెక్ట్‌గా వాలి ర‌క్తాన్ని పీల్చేవి. యాక్ష‌న్ అని డైరెక్ట‌ర్ అన‌గానే ఆర్టిస్టులు చేతుల‌తో ఆ కీట‌కాల‌ను తోలుకుంటూ ఉండేవారు

క్లైమాక్స్ కోసం కొండ‌ల మ‌ధ్య‌లో ఉన్న ఒక లోయ‌ను ఎన్నుకున్నాం. ప్ర‌తిరోజూ వేకువ‌జామున 3.30కే బ‌య‌ల్దేరి మూడు గంట‌ల‌పాటు కొండ‌ల మ‌ధ్య ప్ర‌యాణం చేసి ఆ లోయ‌ను చేరుకునేవాళ్ళం. ఎన్ని క‌ష్టాలు ప‌డితే ఏంటి?  తెలుగు వాళ్లు గ‌ర్వ‌ప‌డే సినిమా తీశాం. జూలై 14వ తేదీన విడుద‌ల కాబోతున్న మా సినిమాని చూశాక మీరంతా మమ్మల్ని కచ్చితంగా అభినందిస్తారనే నమ్మకం మాకుంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)