Breaking News

పూరి జగన్నాథ్‌ స్ఫూర్తితో డైరెక్టర్‌ అయ్యా: దయానంద్

Published on Sat, 01/27/2024 - 17:54

‘స్కూల్ డేస్ నుంచి సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. హ్యాపీ డేస్ సినిమా చూశాక అది మరింత ఎక్కువైంది. ఏం మాయ చేసావే సినిమా చూశాక మేకింగ్ నాచురల్ గా చేయొచ్చు అనిపించింది. పూరి జగన్నాథ్ గారి స్ఫూర్తితో డైరెక్టర్ రావాలనుకున్నా. అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో ఆరు నెలలుకోర్స్ చేశాను. కొంతమంది రైటర్స్ తో ట్రావెల్ చేశాక మంచి కథ రాయాలనిపించింది. అలా రాసిన కథే ‘గేమ్‌ ఆన్‌’. ఇదిరెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా.. అన్నీ ఉంటూనే డిఫరెంట్ గా ఉంటుంది’అని అన్నారు యంగ్‌ డైరెక్టర్‌ దయానంద్‌. ఆయన దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సంద‌ర్భంగా దర్శకుడు దయానంద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

► గేమ్‌ ఆన్‌ మూవీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. మొదటి చిత్రంతోనే నా మార్క్ ఉండేలా ప్రయత్నించాను. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలా మారింది అనేది సినిమాటిక్ గా చూపించాం. ఒక్కొక్క టాస్క్ దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. 
ఇలాంటి టాస్క్ లు తొమ్మిది ఉంటాయి. సెకండాఫ్ లో వచ్చే టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ గేమ్ ఏ విధంగా హెల్ప్ చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్.

► ఈ మూవీ యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా  ఉంటాయి. వాటిని టీజర్, ట్రైలర్ లో రివీల్ చేయలేదు. మధుబాల గారి క్యారెక్టర్ చాలా కొత్తగా, ఐకానిక్ గా ఉంటుంది. ఆదిత్యామీనన్ గారిది చాలా స్మార్ట్ క్యారెక్టర్. ఇందులో సైకలాజికల్ డాక్టర్ గా ఆయన నటించారు. ఆయన యాక్టింగ్ లో చాలా షేడ్స్ కనిపిస్తాయి. శుభలేఖ సుధాకర్ గారు మరో ఇంపార్టెంట్ రోల్ చేశారు. వీరంతా సినిమాకు చాలా ప్లస్ అయ్యారు.

► నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి.  సెకండ్ హీరోలా ఆమె పాత్ర ఉంటుంది. నిర్మాత రవి కస్తూరి గారికి స్క్రిప్ట్ నచ్చి నాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. క్రియేటివ్ పరంగా ఆయన నాకు చాలా సపోర్ట్ చేశారు.  

► ఫస్ట్ షెడ్యూల్ అయ్యాక మాలో కాన్ఫిడెంట్ పెరిగింది. దీంతో సెకండ్ షెడ్యూల్ నుంచి బడ్జెట్ పెంచి ఇంకా బాగా తీయాలనుకున్నాం. చాలా రియలిస్టిక్ గా సినిమా సాగుతుంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది.  తక్కువ ధియేటర్లో విడుదలైనా నెమ్మదిగా థియేటర్లు పెరిగే అవకాశం ఉంటుందని నమ్మకం ఉంది. ఇప్పటికే వేసిన కొన్ని ప్రివ్యూ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడొచ్చు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)