Breaking News

ఈ సినిమా ఇద్దరికీ అగ్నిపరీక్షే

Published on Thu, 11/21/2024 - 00:50

‘‘చిన్న సినిమా.. పెద్ద సినిమా అని ఉండదు. మంచి సినిమానా? కాదా? అనేది ఉంటుంది. ‘దేవకి నందన వాసుదేవ’ వంద శాతం మంచి సినిమా అనిపించింది. ఈ చిత్రం అశోక్‌కి, అర్జున్‌కి అగ్ని పరీక్షే. ఈ పరీక్షని ఎదుర్కొని వారు నిలబడతారని కోరుకుంటున్నాను’’ అని డైరెక్టర్‌ బోయపాటి శ్రీను అన్నారు. అశోక్‌ గల్లా, వారణాసి మానస జంటగా నటించిన చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్‌ జంధ్యాల దర్శకుడు. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో బోయపాటి శ్రీను, హీరో సుధీర్‌ బాబు  అతిథులుగా పాల్గొన్నారు. 

సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా ట్రైలర్, విజువల్స్, సాంగ్స్‌ చూసినప్పుడు అశోక్‌కి సరైన సినిమా అనిపించింది. తను కమర్షియల్‌ హీరోగా సక్సెస్‌ అవుతాడు’’ అన్నారు. ‘‘నేను రాసిన కథల్లో ఇది మాస్‌ ఎంటర్‌టైనర్‌. ఈ పాత్రకి అశోక్‌ కరెక్టుగా సరిపోయాడు. మహేశ్‌బాబుగారి ఫ్యాన్స్, ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని చూసి, సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నా’’ అని చిత్ర కథారచయిత ప్రశాంత్‌ వర్మ అన్నారు. ‘‘ఈ సినిమా నిర్మాణంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను. నాలాంటి కొత్త నిర్మాతని బతికించాలి’’ అని బాలకృష్ణ కోరారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)