మీ బోడి పెర్ఫార్మెన్స్‌ నా దగ్గరొద్దంటూ చిరు చైర్‌ విసిరేశారు..!

Published on Sun, 01/15/2023 - 08:49

మెగాస్టార్‌ చిరంజీవి బయట ఎంత ప్రశాంతంగా ఉంటారో అందరికి తెలిసిందే. ప్రెస్‌ మీట్‌లో కూడా తనదైన శైలీలో జోకులు వేస్తూ.. సరదాగా ఉంటారు. షూటింగ్‌ సమయంలో కూడా అలానే ఉంటారట. కానీ నిర్మాతలకు నష్టం కలిగించే పని చేస్తే మాత్రం ఘోరంగా ఫైర్‌ అవుతారట. ఈ విషయాన్ని డైరెక్టర్‌ బాబీ చెప్పారు. చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో శనివారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా దర్శకుడు బాబీ, మెగాస్టార్‌ చిరంజీవి గురించి ఆసక్తిక విషయాలు వెల్లడించారు. 

‘సెట్‌లో చిరంజీవి పొగడ్తల్ని పట్టించుకోరు. కానీ.. నిర్మాతకి రూపాయి నష్టం వచ్చే పని చేస్తే మాత్రం ఆయనికి కోపం వచ్చేస్తుంది. వేరే సినిమా షూటింగ్‌లో ఆయనలోని శివుడిని నేను చూశా. షాట్‌కి పిలవకుండా మేనేజర్ ఇబ్బంది పడుతుంటే.. ఫస్ట్ టైమ్ చిరంజీవికి కోపం రావడాన్ని చూసి నేను షాక్ అయిపోయా. చైర్ విసిరేసి.. మీబోడి ఫెర్ఫార్మెన్స్‌ నా దగ్గరొద్దు. నేను ఇక్కడ  తినే ఇడ్లీ కన్నా.. అక్కడ షాట్ ఇంపార్టెంట్‌’ అంటూ సిబ్బందిపై ఫైర్‌ అయిన మెగాస్టార్‌ని నేను దూరం నుంచి చూశాను. సినిమాకు ఇబ్బంది కలిగితే అన్నయ్యకు కోపం వస్తుందని నాకు అర్థమైంది. 

వాల్తేరు వీరయ్య షూటింగ్ టైమ్‌లో అలా ఇబ్బంది తేకూడదని ప్రయత్నించా. ఈ క్రమంలో ఓ రోజు ఫోన్ చేసి.. అన్నయ్యా... పీటర్ మాస్టర్ ఊరెళ్తానని అంటున్నారు. ఒక ఫైట్ సీన్.. మీరు సాంగ్ గ్యాప్‌లో ఓ మూడు గంటలు వస్తే? అంటూ మొహమాటంగా చెప్పాను. దానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నావ్.. కరెక్ట్‌గా చెప్పు నాకు అర్థం అవ్వడం లేదు అని చిరంజీవి గారు అన్నారు. ఏం లేదు అన్నయ్య మీరు రేపు ఓ మూడు గంటలు వస్తే.. మీ పోర్షన్‌ కంప్లీట్ చేస్తాను. మళ్లీ రేప్పొద్దున ‘నాకు చెప్పాలి కదా సెట్‌ ఎందుకు హోల్డయ్యిందని’ అంటారని చెప్పేస్తున్నా అని చెప్పాను. దానికి ఇంతగా చెప్పాలా బాబీ.. రేపు మీరు రా అన్నయ్యా అంటే రానా? అంటూ చాలా సింపుల్‌గా చెప్పారు’అని బాబీ గుర్తు చేసుకున్నారు.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)