Breaking News

డింపుల్‌ హయాతిపై క్రిమినల్‌ కేసు.. స్పందించిన నటి

Published on Tue, 05/23/2023 - 10:54

రామబాణం ఫేం డింపుల్‌ హయాతిపై క్రిమినల్‌ కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ జూబ్లిహిల్స్ పోలీసులు ఫిర్యాదు చేశాడు. డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లను కూడా పోలీసులకు సమర్పించాడు. ఫిర్యాదు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

(చదవండి: చివరి కోరిక నెరవేరకుండానే కన్నుమూసిన శరత్‌బాబు)

ఇదిలా ఉంటే.. ఈ కేసుపై డింపుల్‌ పరోక్షంగా స్పందించారు. అధికారాన్ని ఉపయోగించి తప్పులను కప్పిపుచ్చుకోలేరని ట్వీట్‌ చేశారు. అంటే ఈ వ్యవహారంలో తన తప్పులేదని, డీసీపీ రాహుల్‌ హెగ్డేనే తనకున్న అధికారంతో తప్పుడు కేసులు పెట్టించారని డింపుల్‌ పరోక్షంగా చెప్పుకొచ్చింది. 

అసలేం జరిగింది?
హైదరాబాద్‌లోని  జర్నలిస్ట్ కాలనీలో ఐపీఎస్‌ అధికారి రాహుల్ హెగ్డే నివాసం ఉటున్నారు. అదే అపార్ట్‌మెంట్‌లో డింపుల్‌ హయాతి తన స్నేహితుడు డేవిడ్‌తో కలిసి ఉంటున్నారు. రాహుల్ హెగ్డేకు ప్రభుత్వం కేటాయించిన వాహనాన్ని ఆయన డ్రైవర్‌ చేతన్‌ కుమార్‌ అదే అపార్టమెంట్‌లోని సెల్లార్‌లో పార్కింగ్‌ చేశాడు. ఆ వాహనం పక్కనే డింపుల్‌ హయాతి కూడా తన వాహనాన్ని పార్కింగ్‌ చేస్తుంది. . దీనిపై వారికి ప‌లు మార్లు గొడ‌వైంది.అయితే తాజాగా డింపుల్ స‌ద‌రు ఆఫీస‌ర్ కారుని ఉద్దేశ‌పూర్వ‌కంగా ఢీ కొట్ట‌డంతో పాటు కాలితో తంతూ గొడ‌వ చేసింది. అక్క‌డున్న డ్రైవ‌ర్‌తోనూ ఆమె గొడ‌వ ప‌డింది. దీంతో ఐపీఎస్ ఆఫీస‌ర్ జూబ్లీ హిల్స పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)