Breaking News

రవితేజతో గ్లామర్‌ బ్యూటీ.. 'ఫుల్‌ కిక్‌'

Published on Wed, 11/05/2025 - 10:57

రవితేజ నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మాస్‌ జాతర’ కొద్దిరోజుల క్రితమే విడుదలైంది. అయితే, అనుకున్నంత రేంజ్‌లో మెప్పించలేదు. దీంతో ఆయన తదుపరి సినిమా (RT 76) పనిలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ పతాకంపై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతుంది. ఒక ప్రత్యేకమైన సాంగ్‌ చిత్రకరణ జరుగుతుంది.

ఇటీవలే స్పెయిన్‌లో ఒక పాట చిత్రీకరణను ముగించిన ఈ బృందం ఇప్పుడు హైదరాబాద్‌లో మరో పాటను చిత్రీకరించే పనిలో ఉంది.  గతంలో రవితేజతో ఖిలాడిలో జతకట్టిన డింపుల్ హయాతి, RT 76 తారాగణంలో చేరినట్లు ఆమె ధృవీకరించింది. ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం రవితేజతో కలిసి ఒక పాటను చిత్రీకరిస్తున్నారని డింపుల్ పంచుకుంది. ఆపై "చార్ట్‌బస్టర్" రాబోతోందని అభిమానులకు సూచించింది. ఆమెతో పాటు ఆషికా రంగనాథ్ కూడా ఇందులో భాగం కానుంది. గతంలో రవితేజ, డింపుల్‌ కలిసి 'ఖిలాడి' సినిమాలో 'ఫుల్‌ కిక్‌' అంటూ ఒక పాటలో  ఇద్దరూ దుమ్మురేపారు.

ఈ ప్రాజెక్ట్‌కు మొదట ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, అనార్కలి అనే టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని సమాచారం.  ఇది 2026 సంక్రాంతి విడుదలకు సిద్ధంగా ఉంది. చాలా రోజుల తర్వాత రవితేజ ఒక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రంతో రానున్నడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)