Breaking News

దిల్‌రాజు వాంగ్మూలం నమోదు చేసిన అధికారులు

Published on Sat, 01/25/2025 - 08:22

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌రాజు ఇల్లు, కార్యాలయాలపై వరుసగా నాలుగో రోజూ ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు కొనసాగాయి. మంగళవారం నుంచి పలువురు టాలీవుడ్‌ నిర్మాతలు, నిర్మాణ సంస్థలకు చెందిన వ్యక్తులు, ఫైనాన్షియర్ల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల బృందాలు తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్‌ సుకుమార్‌ సహా పలువురి ఇళ్లలోనూ గురువారం వరకు సోదాలు జరిగాయి.

దిల్‌ రాజు ఇంట్లో మాత్రం ఐటీ సోదాలు శుక్రవారంతో ముగిశాయి. 5 రోజుల సెర్చ్‌ వారెంట్‌తో ప్రారంభించిన సోదాలకు సంబంధించి శుక్రవారం దిల్‌ రాజు వాంగ్మూలం నమోదు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులు దిల్‌ రాజును శ్రీనగర్‌ కాలనీలోని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీస్‌కు తీసుకెళ్లారు. ఆయన సమక్షంలోనే డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని స్వా«దీనం చేసుకున్నారు. గేమ్‌ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సహా ఇటీవల నిర్మించిన సినిమాల గురించి ఆరా తీసినట్లు తెలిసింది.

డాకు మహారాజ్‌ సినిమాకు దిల్‌రాజు    
డి్రస్టిబ్యూటర్‌గా ఉండటంతో ఆ సినిమా కలెక్షన్లపైనా కొన్ని వివరాలు తీసుకున్నట్టు సమాచారం. అనంతరం పలు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, సినిమాలకు ఖర్చు చేసిన సొమ్ము, వచ్చిన  లాభాలు వంటి అంశాలపై ఐటీ అధికారులు దిల్‌ రాజుతోపాటు ఎస్‌వీసీ ఆడిటర్, అకౌంటెంట్‌ వాంగ్మూలాలను నమోదు చేసినట్లు తెలిసింది. ఆదాయ పన్ను చెల్లింపుల్లో వ్యత్యాసాలకు సంబంధించి వివరణ కోరినట్లు సమాచారం.  

సినీ ప్రముఖుల ఇళ్లలో ముగిసిన ఐటీ సోదాలు
సినీ ప్రముఖుల ఇళ్లలో నాలుగు రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు.. శనివారం తెల్లవారుజామున ముగిశాయి. ఈ సోదాల్లో కీలక ాడాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)