Breaking News

రీరిలీజ్‌ సినిమాకి 10 థియేటర్స్‌ ఫుల్‌!

Published on Wed, 03/05/2025 - 16:08

విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు క్లాసిక్ బ్లాక్ బస్టర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'( Seethamma Vakitlo Sirimalle Chettu). శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు(Dil Raju) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2013లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమాని మార్చి 7న గ్రాండ్ గా రీరిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రీరిలీజ్‌ కోసం మహేశ్‌ ఫ్యాన్స్‌తో పాటు వెంకీ మామ అభిమానులు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వెంకీ, మహేశ్‌ల బ్రో కెమిస్ట్రీని మళ్లీ థియేటర్స్‌లోనే చూసి ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారు. అందుకే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 10 థియేటర్స్‌లో ఫుల్‌ అయిపోయాయట. రీరిలీజ్‌కి ఈ స్థాయిలో టికెట్స్‌ బుక్‌ కావడం రికార్డు అంటున్నాడు దిల్‌ రాజు. 

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..మార్చి7 శుక్రవారం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ చేస్తున్నాం. తొలిప్రేమ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఐదేళ్ళు సినిమా రైట్స్ మా వద్ద ఉండేవి. మాకు ఎప్పుడు డబ్బులు తక్కువ ఉన్న సినిమాని రీరిలీజ్ పెడితే ఆ సినిమా ద్వారా మనీ వచ్చేవి. అవన్నీ మిరాకిల్స్ డేస్. అలాగే ఇప్పుడు కూడా రీరిలీజ్ పెడితే ఆడియన్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ రీరిలీజ్ కి సంబధించి అప్పడే పది థియేటర్లు ఫుల్ అయిపోయాయి. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆల్రెడీ ఓటీటీ లో ఉంది. జనం చుసేశారు. 

అయినప్పటికీ మళ్ళీ థియేటర్స్ కి వస్తున్నారంటే.. మంచి కంటెంట్ మళ్ళీ చూద్దామని వస్తున్నారు. మహేష్ గారి అభిమానులు, వెంకటేష్ గారి అభిమానులు థియేటర్ కి వచ్చి మళ్ళీ  బ్రదర్స్ మధ్య వుండే మూమెంట్స్ ని మళ్ళీఎంజాయ్ చేద్దామని ఇన్ని థియేటర్స్ ఫుల్ చేశారంటే చాలా హ్యాపీగా వుంది. మంచి సినిమాలు తీస్తే థియేటర్స్ కి జనాలు వస్తారని రీరిలీజ్ లు ప్రూవ్ చేస్తున్నాయి. ఆంద్రలో డే వన్ అరవై డెబ్బై శాతం అడ్వాన్స్ బుకింగ్స్ వున్నాయి. ఫ్రైడేకి అవి ఫుల్స్ అయిపోతాయి. సుదర్శన్ 35ఎంఎం సెకండ్ డే కూడా నాలుగు షోలు ఫుల్ అయ్యాయి. రీరిలీజ్ హ్యాపీనెస్ ఈ సినిమా ద్వారా కనిపిస్తోంది. నేనూ వెళ్లి మార్చి 7న సుదర్శన్ 35ఎంఎం లో మార్నింగ్ ఎనిమిది గంట షో చూస్తాను. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయాలని అనిపిస్తోంది. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇద్దరు బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి అందరూ థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి'అన్నారు.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)