Breaking News

విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్‌.. లీక్‌ చేసిన దిల్‌ రాజు!

Published on Wed, 03/05/2025 - 14:08

దిల్‌ రాజు(Dil Raju) నిర్మాణ సంస్థలో విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా బోల్తా పడింది. సినిమా బాగుందని టాక్‌ వచ్చినా సరే.. కలెక్షన్స్‌ మాత్రం రాలేదు. కనీసం ఒపెన్సింగ్స్‌ రాబట్టలేకపోయింది. ఆ నష్టాన్ని పూడ్చడానికి దిల్‌ రాజు బ్యానర్‌లోనే మరో సినిమా చేస్తున్నాడు విజయ్‌. ‘రాజావారు రాణివారు’ఫేం రవికిరణ్‌ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఈ సినిమా పనులు సైలెంట్‌గా ప్రారంభం అయ్యాయి. యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై సోషల్‌ మీడియాలో రకరకాల పుకార్లు వినిపించాయి. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ సినిమా టైటిల్‌ని మేకర్స్‌ ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. త్వరలోనే ఓ ఈవెంట్‌ పెట్టి టైటిల్‌ అనౌన్స్‌ చేద్దాం అనుకున్నారట. కానీ ఈ లోపే దిల్‌ రాజు సినిమా టైటిల్‌ని ప్రకటించి మేకర్స్‌కి షాకిచ్చాడు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా రీరిలీజ్‌ సందర్భంగా బుధవారం నిర్మాత దిల్‌ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాల అప్‌డేట్స్‌ గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్ధన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. 

అయితే ఈ టైటిల్‌ని ఇంతవరకు ప్రకటించలేదనే విషయం దిల్‌ రాజు మర్చిపోయారు. మీడియా ప్రతినిధి ఆ విషయాన్ని గుర్తు చేయడంతో దిల్‌ రాజుతో పాటు మిగతావాళ్లు కూడా ఘొల్లున నవ్వేశారు. ఈ చిత్రంతో పాటు ‘బలగం’ వేణు దర్శకత్వంలో కూడా దిల్‌రాజు ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్‌ని ఖరారు చేవారు. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)