Breaking News

ఆర్థిక ఇబ్బందులు ఉంటే 'దిల్‌ రాజు' సాయం చేశారు: విజయ్‌ దేవరకొండ

Published on Tue, 04/02/2024 - 13:22

విజయ్‌ దేవరకొండ - మృణాల్‌ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'ఫ్యామిలీ స్టార్‌'. గీతా గోవిందం తర్వాత విజయ్‌తో డైరెక్టర్‌ పరశురామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న విజయ్‌ దేవరకొండ.. దిల్‌ రాజు గురించి ఆసక్తికర సంఘటనను గుర్తుచేసుకున్నారు.

కొవిడ్‌ సమయంలో విజయ్‌కు దిల్‌ రాజు చేసిన సాయాన్ని బహిరంగంగానే ఇలా చెప్పాడు.  'నాతో సినిమా చేయాలని దిల్‌ రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నాకు కూడా ఆయన బ్యానర్‌లో సినిమా చేయాలనే కోరిక ఉంది. అందుకోసం కొన్ని కథలు కూడా పంపించారు. కానీ సినిమా పట్టాలెక్కేందుకు కాస్త సమయం తీసుకుంది. ఇంతలో కొవిడ్‌ రావడంతో ఆ సమయంలో నాకు కొంత డబ్బు అవరసరం వచ్చింది. అప్పుడు దిల్‌ రాజు గారే అడ్వాన్స్‌ రూపంలో సాయం చేశారు. అప్పటికి సినిమా కూడా ఒప్పుకోలేదు.' అని ఆయన అన్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన 'కేరింత' కోసం ఆడిషన్స్‌కు వెళ్లితే తనను సెలెక్ట్‌ చేయలేదని విజయ్‌ దేవరకొండ గుర్తుచేసుకున్నాడు. అందుకు తాను బాగా హర్ట్‌ అయినట్లు ఆయన చెప్పారు. అదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం దిల్‌రాజుతోనూ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ సమయం నుంచి కరెక్ట్‌ కథ కోసం ఎదురుచూస్తే.. ఇప్పుడు ఫ్యామిలీస్టార్‌తో సెట్‌ అయినట్లు విజయ్‌ అన్నారు. ఫ్యామిలీస్టార్‌ తర్వాత  విజయ్‌తో మరో సినిమా తీస్తానని దిల్‌ రాజు ప్రకటించారు. చాలారోజుల నుంచి విజయ్‌తో  భారీ ప్రాజెక్ట్ చేయాలని‌ ప్లాన్‌ చేసినట్లు దిల్‌ రాజు అన్నారు. అందుకు సంబంధించిన  స్క్రిప్ట్‌ కూడా రెడీ పెట్టుకున్నానని ఆయన అన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)