Breaking News

ఆలియా బాటలోనే కియారా! పెళ్లికి ముందే ప్రెగ్నెంటా? నటుడి షాకింగ్‌ ట్వీట్‌

Published on Mon, 02/13/2023 - 16:40

బాలీవుడ్‌ క్రిటిక్‌, నటుడు కమల్‌ ఆర్‌ ఖాన్‌(కేఆర్‌కే) గురించి తెలిసిందే. సినీ సెలబ్రెటీలు టార్గెట్‌గా తరచూ వారిని విమర్శిస్తుంటాడు. స్టార్‌ హీరోల సినిమాలు, బి-టౌన్‌ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు, ఎఫైర్స్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో అతడు ఎన్నోసార్లు వివాదంలో చిక్కుకున్నాడు. ఈక్రమంలో అతడిపై పలుమార్లు పోలీసు కేసు కూడా నమోదైంది. అయినప్పటికీ కమల్‌ ఆర్‌ ఖాన్‌ తన తీరును మాత్రం మార్చుకోవడం లేదు. ఇప్పటికే ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, ఆలియా భట్‌ వంటి స్టార్స్‌ సంచలన వ్యాఖ్యలు చేసి వివాదంలో పడ్డాడు.

చదవండి: ఎయిర్‌పోర్ట్‌ వివాదం: విజయ్‌ సేతుపతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం

అయితే తాజాగా అతడు ఓ బాలీవుడ్‌ కొత్త జంటను టార్గెట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆదివారం కమల్‌ ఓ షాకింగ్‌ ట్వీట్‌ చేశాడు. ‘ప్రస్తుతం బాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ నడుస్తోంది. అదే! ఫస్ట్‌ ప్రెగ్నెంట్‌ అయ్యాకే ఆ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్‌ జంట కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యింది’ అంటూ ట్వీట్‌ చేశాడు. అయితే తన ట్వీట్‌ ఆ జంట ఎవరనేది మాత్రం చెప్పలేదు. దీంతో కొత్తగా పెళ్లి చేసుకుంది కియారా-సిద్ధార్థ్‌ కదే! అంటే కేఆర్‌కే వారిని ఉద్దేశించే ఈ ట్వీట్‌ చేశాడా? అని నెటిజన్లంతా ఆలోచనపడ్డారు.

చదవండి: శివరాత్రి స్పెషల్‌: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే

ఆలియా భట్ బాటలోనే కియారా కూడా వెళ్లిందా? కియారా గర్భవతి అయినందువల్లే వారు సడెన్‌గా చేసుకున్నారా? అని కొందరూ అనుమానం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు కేఆర్‌కే కామెంట్స్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేయడం ఇకనైనా ఆపమంటూ అతడిపై మండిపడుతున్నారు. ‘మీ పని మీరు చూసుకోండి.. ఎప్పుడూ పక్కవాళ్లపై పడుతుంటారు’ అంటూ కేఆర్‌కేకు చురకలు అంటిస్తున్నారు నెటిజన్లు. కాగా కొంతకాలంగా సీక్రెట్‌గా డేటింగ్‌లో ఉన్న కియారా-సిద్ధార్థ్‌ రీసెంట్‌గా గుట్టుచప్పుడుగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఫిబ్రవరి 7న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌ జైసల్మేర్‌లోని సూర్యగఢ్‌ ప్యాలెస్‌లో వీరి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)