Breaking News

ఓటీటీలోకి రాబోతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ

Published on Mon, 07/03/2023 - 08:12

ఫహాద్ ఫాజిల్ పేరుకే మలయాళ నటుడు గానీ డబ్బింగ్ సినిమాల వల్ల తెలుగు ప్రేక్షకులకు గత కొన‍్నేళ్ల నుంచి బాగా పరిచయమే. అల్లు అర్జున్ 'పుష్ప' చిత్రంలో భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఫహాద్‌ ఫాజిల్‌ నటించిన 'ధూమమ్‌' సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీగా ఉంది. మలయాళంతో పాటు కన్నడలో జూన్‌ 23న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. యూ టర్న్ ఫేమ్‌ పవన్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

(ఇదీ చదవండి; రూ. 20 కోట్లతో ఇల్లు కొన్న హీరోయిన్‌.. ఆయన బహుమతే కదా అంటూ..)

'కేజీఎఫ్, కాంతార,సలార్‌' లాంటి అద్భుతమైన సినిమాలు నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారే ధూమమ్‌ను నిర్మించారు. దీన్ని తెలుగులో కూడా విడుదల చేయాల్సింది కానీ ఎందుకో వెనక్కి తగ్గి.. కేవలం మలయాళ, కన్నడ భాషలకే పరిమితం చేశారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ మూవీ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. జులై 21 నుంచి ధూమమ్ స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తుంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.  ఈ సినిమాలో అపర్ణా బాల మురళి హీరోయిన్‌గా మెప్పించింది. ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్‌లో ఈ సినిమా రానున్నట్లు సమాచారం.

(ఇదీ చదవండి: Nayanthara: నయనతార ఆశలన్నీ 75 పైనే!)

'ధూమం' కథేంటి?
సిగరెట్ కంపెనీలో పనిచేసే అవినాష్(ఫహాద్ ఫాజిల్) జీవితం, జీతం బాగానే ఉంటుంది. కానీ ఈ ఉద్యోగం వదిలేయాలని నిర్ణయించుకుంటాడు. తమ సంస్థ వల్ల చిన్నపిల్లలు కూడా పొగాకు బారిన పడుతుండటమే దీనికి కారణం. సరిగ్గా ఈ టైంలోనే అవినాష్, అతడి భార్య ఓ ప్రమాదంలో పడతారు. వీళ్ల బాడీలకు టైమ్ బాంబ్ ఫిక్స్ చేస‍్తారు. అది పేలకూడదంటే సిగరెట్స్ తాగుతూ తక్కువ సమయంలో కోటి రూపాయలు పోగు చేయాలి. ఈ గండం నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేదే 'ధూమం' స్టోరీ.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)