Breaking News

డెలివరీ తర్వాత కాళ్లు, చేతులు కదల్లేవు.. బతకననుకున్నా: నటి

Published on Wed, 03/12/2025 - 20:40

ప్రెగ్నెన్సీ జర్నీ అంత బాగానే జరిగినా.. డెలివరీ సమయంలో మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నానంటోంది నటి దేవిక నంబియార్‌ (Devika Nambiar). ఇటీవలే ఈమె రెండో బిడ్డకు జన్మనిచ్చింది. తన డెలివరీ జర్నీ గురించి దేవిక మాట్లాడుతూ.. నా మొదటి ప్రెగ్నెన్సీ సాఫీగా సాగింది. ఇది కూడా అలాగే ఉంటుందనుకున్నాను. అందుకే బ్యాగ్‌ కూడా సర్దుకోలేదు. కానీ ఈసారి ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే నేను కళ్లు తెరవకపోవడంతో అందరూ చాలా భయపడ్డారు.

స్పృహ కోల్పోయిన నటి
ఒకరోజు తర్వాత స్పృహలోకి వచ్చి నా బిడ్డను చూసుకున్నాను. అప్పటికీ నా కాళ్లు, చేతులు కదలకపోవడంతో చనిపోతానేమో అనుకున్నాను అని చెప్పుకొచ్చింది. దేవిక భర్త, సింగర్‌ విజయ్‌ మాట్లాడుతూ.. మాకు బిడ్డను చూపించారు కానీ నా భార్యను కలవనివ్వలేదు. సమయం గడిచేకొద్దీ నాలో భయం ఎక్కువైంది. నేను ఎలాగైనా కలవాల్సిందేనని చెప్పగా దేవిక స్పృహలోనే లేదని చెప్పారు. షాకయ్యాను. ఆమె ముక్కు, నోట్లో పైపులు పెట్టారు.

బోరున ఏడ్చేశా
తననలా చూడగానే అంతా అయిపోయిందనుకున్నాను. తనను వెంటిలేటర్‌పై పెట్టారు. ఆమెనలా ఎన్నడూ చూడలేదు. గదిలోకి వెళ్లి ఏదీ తినకుండా బోరుమని ఏడ్చాను అని చెప్పుకొచ్చాడు. కాగా దేవిక కలభ మజా, గల్ఫ్‌ రిటర్న్స్‌, పరయాన్‌ బాకీ వచెత్తు, స్నేహ కాదల్‌, వికడకుమారన్‌, కట్టప్పనేయిలే రిత్విక్‌ రోషన్‌ వంటి మలయాళ చిత్రాలతో పాటు తమిళంలోనూ నటించింది. ఈమె నటి మాత్రమే కాదు యాంకర్‌ కూడా! సినిమాల మధ్యలో ఆల్బమ్‌ సాంగ్స్‌ కూడా చేసింది.

చదవండి: ఎక్స్‌ట్రాలు ఎక్కువైతున్నాయ్‌.. ఇలాంటివారికి బుద్ధి చెప్పాల్సిందే!

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)