అమరావతిలో సదుపాయాలు లేవు.. కూటమి పార్టీ MLA షాకింగ్ కామెంట్స్
Breaking News
సినిమా గుమ్మం దాటని దేవయాని వారసురాలు
Published on Tue, 08/18/2026 - 08:15
సినిమా చాలా శక్తివంతమైనది. దాని ప్రభావం ప్రేక్షకులపైనే కాకుండా, చిత్ర రంగంలోని వారిపైనా ఎక్కువే ఉంటుంది. ముఖ్యంగా ఇది రంగుల ప్రపంచం. ఒక్కసారి ఎంటర్ అయితే అందులో నుంచి బయటపడటం అసాధ్యమనే చెప్పాలి. విజయపథంలో ఉన్న వారు మరింత ఉన్నత స్థాయి కోసం, విజయాలు లేని వారు దాన్ని అందుకోవడం కోసం నిరంతరం పరితపిస్తూనే ఉంటారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే వారసులు సినిమా గుమ్మం దాటడానికి సుముఖత చూపడం లేదనే చెప్పాలి. చాలా మంది నటీనటులు, దర్శక నిర్మాతల వారసులు ఇక్కడే విజయాలను వెతుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందుకు చిన్న ఉదాహరణ నటి కుష్బూ సుందర్ వారసురాళ్లు. ఈమె ఇద్దరు కూతుళ్లలో ఒకరు కథానాయకిగాను, మరొక నిర్మాత గాను రంగంలోకి దిగారు. ఈ పుట్టింట్లో నటి దేవయాని రాజ్ కుమార్ వారసురాలు చేరారు. దేవయాని ప్రముఖ కథానాయకి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆమె భర్త రాజ్ కుమార్ ప్రముఖ దర్శకుడు అన్నది తెలిసిందే. వీరికి ఇద్దరు కూతుళ్లు.అందులో పెద్ద కూతురు ఇనియ. రెండవ కూతురు ప్రియాంక. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే రాజ్‌కుమార్, దేవయాని దంపతులు తమ పిల్లలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దారు. అదేవిధంగా వారికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు.

అయితే వారిద్దరు తల్లిదండ్రుల వారసత్వాన్ని తమ భుజాలపై వేసుకున్నారు. పెద్ద కూతురు బుల్లి తెరను తన పయనంగా ఎంచుకున్నారు. టీవీ షోలలో పాల్గొంటూ ప్రేక్షకుల్లో పాపులర్ అవుతున్నారు. ముఖ్యంగా సెల్ఫీ రీల్స్ చేస్తూ వైరల్ అవుతున్నారు. ఇక రెండవ కూతురు కథానాయకిగా రంగప్రవేశం చేశారు. నటుడు ప్రశాంత్ హీరోగా నటిస్తున్న రంజన్ ది అడ్వకేట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది తెలుగులో మంచి హిట్ అయిన కోర్టు చిత్రానికి రీమేక్ అన్నది గమనార్హం. ఇలా చాలా మంది సినీ వారసులు సినిమా గుమ్మం దాటడం లేదు.
Tags : 1