Breaking News

'దేవర' నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చేసింది

Published on Fri, 08/02/2024 - 17:42

దేవర సినిమా నుంచి జూ ఎన్టీఆర్‌ అభిమానులకు శుభవార్త వచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌తో పాటు రెండో సాంగ్‌ విడుదల తేదీని మేకర్స్‌ ప్రకటించారు.  ఆర్ఆర్ఆర్  హిట్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్‌ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కుస్తున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‍తో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి.

దేవర సినిమా నుంచి రెండో పాట ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈమేరకు విడుదల చేసిన పోస్టర్‌లో తారక్‌ చాలా గ్లామర్‌గా కనిపిస్తున్నారు.  అందులో జాన్వీ కపూర్‌తో తారక్‌ ఉన్న ఫోటో తొలిసారి విడుదల కావడంతో నెట్టింట వైరల్‌ అవుతుంది. దేవర ఫియర్ సాంగ్ విడుదలైన నుంచి ఈ చిత్రానికి భారీగా బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ పాటకు సంగీతం అందించిన  అనిరుధ్ రవిచందర్‌పై ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు రెండో పాటు విడుదల కానుంది. ఈ మెలోడీ సాంగ్‌కు ఏ రేంజ్‌లో ట్యూన్స్‌ ఉంటాయోనని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

విడుదల విషయంపై క్లారిటీ
దేవర సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తాజా పోస్టర్‌తో తేలిపోయింది. విడుదల విషయంలో ఎలాంటి జాప్యం ఉండదని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్‌.. కొత్త పోస్టర్‌లో సెప్టెంబర్ 27వ తేదీన దేవర విడుదల అవుతుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. 
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)