Breaking News

తెలంగాణలో 'దేవర'కు అదనపు షోలకు అనుమతి.. టికెట్‌ ధరలు ఇలా

Published on Mon, 09/23/2024 - 19:51

ఎన్టీఆర్‌- కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'దేవర'. సెప్టెంబర్‌ 27న విడుదల కానున్న ఈ సినిమాకు ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దేవర చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో  మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్‌ సమర్పకులు. ఇందులో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

తెలంగాణలో టికెట్‌ ధరలు ఇలా
దేవర సినిమాకు అదనపు షోలు ప్రదర్శించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్‌ 27న అర్ధరాత్రి 1గంట షో కోసం 29 థియేటర్స్‌కు అవకాశం ఇస్తున్నట్లు తాజాగా జీఓ విడుదల చేసింది. అయితే, టికెట్‌ ధర విషయంలో రూ. 100 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. అదే రోజు ఉదయం 4 గంటల ఆటతో పాటు మొత్తం 6 షోల వరకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. సింగిల్‌ స్క్రీన్‌, మల్టీఫ్లెక్స్‌ అన్నీ థియేటర్స్‌ కూడా ఆ ఒక్కరోజు టికెట్‌ ధర రూ. 100 పెంచుకునేందుకు అవకాశం ఉంది. 

అయితే, సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 6 వరకు మాత్రం రోజుకు 5 షోల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఈ తొమ్మిది రోజులకు టికెట్‌ ధరల్లో మార్పులు ఉన్నాయి.  సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్స్‌ అయితే టికెట్‌పై రూ. 25, మల్టీఫ్లెక్స్‌ అయితే రూ. 50 మాత్రమే పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. దేవర విడుదల రోజు  సింగిల్‌ స్క్రీన్‌లో టికెట్‌ ధర రూ. 295 ఉంటే మల్టీఫ్లెక్స్‌లో మాత్రం రూ. 413 ఉంటుంది.

ఏపీలో టికెట్‌ ధరలు ఇలా
'దేవర' విడుదల రోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు ఏపీ అనుమతిచ్చింది. ఆ తర్వాత రోజు 5 షోలు ప్రదర్శించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇలా 9రోజుల వరకు అదనపు షోలు  ఉండనున్నాయి. ఇదే క్రమంలో దేవర టికెట్ల ధరలను సైతం పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ మొదటి తరగతి టికెట్స్‌కు రూ. 110, దిగువ తరగతి రూ.60 వరకు పెంచింది. మల్టీప్లెక్స్‌లలో అయితే రూ. 135 చొప్పున పెంచింది. జీఎస్టీతో కలుపుకొనే ఈ ధరలు ఉండనున్నాయి. అంటే ఈ లెక్కన సింగిల్‌ స్క్రీన్‌లో దేవర టికెట్ ధర రూ. 225 ఉంటే మల్టీప్లెక్స్‌లలో మాత్రం రూ.320 ఉండనుంది. ఈ పెరిగిన ధరలు సెప్టెంబర్‌ 27 నుంచి 14 రోజుల పాటు ఉండనున్నాయి.
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)