Breaking News

'దేవర'కు 100 రోజులు.. ఎన్ని కేంద్రాలు, ఎక్కడెక్కడ..?

Published on Sat, 01/04/2025 - 13:18

ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్‌ సినిమా దేవ‌ర 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఒక సినిమా పది రోజులు థియేటర్స్‌లో రన్‌ కావడమే గొప్ప విషయమని చెప్పవచ్చు. అలాంటిది దేవర చిత్రం ఆరు కేంద్రాలలో వందరోజుల మార్క్‌ను అందుకుంది. పుష్ప2 వంటి భారీ హిట్‌ సినిమా ముందు కూడా దేవర ఈ రికార్డ్‌ సాధించడం అనేది సాధరణ విషయం కాదని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఒక సినిమా 100రోజులు, 50 రోజులు ప్రదర్శన అనే మాటే వినిపించడమే లేదు.  అయితే, దేవర ఆ లోటును పూర్తి చేసింది.

దేవర సినిమా 52 కేంద్రాల్లో 50 రోజుల  పోస్టర్‌ పడింది. ఇప్పుడు ఆరు కేంద్రాలలో దేవర 100 రోజులు  విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ మేరకు తాజాగా మేకర్స్‌ ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్‌ 15న దేవర 50 రోజుల వేడుకను సెలబ్రేట్‌ చేసుకున్న అభిమానులు ఇప్పుడు వందరోజుల పండగను సందడిగా జరుపుకుంటున్నారు.

ఆరు థియేటర్లలో 100 రోజులు
ఈస్ట్‌ గోదావరి జిల్లాలో రెండు థియేటర్స్‌ మలికిపురం ( పద్మజ ), మండపేట (రాజరత్న) ఉన్నాయి. చిలకలూరిపేటలోని (రామకృష్ణ), చిత్తూరు జిల్లాలోని బి. కొత్తకోట (ద్వారక), కల్లూరు (ఎమ్‌ఎన్‌ఆర్‌), రొంపిచర్ల (ఎమ్‌ఎమ్‌ డీలక్స్‌)  వంటి థియేటర్లలో దేవర 100 రోజులు పూర్తి చేసుకుంది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర సినిమాతో జాన్వీకపూర్‌ తొలిసారి తెలుగు తెరపై మెరిసింది. ఇందులో  సైఫ్‌ అలీఖాన్‌, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌ వంటి స్టార్స్‌ కీలకపాత్రల్లో నటించారు. సినిమాటోగ్రఫీతో పాటు సంగీతం ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. దేవర పార్ట్‌2 కూడా ఉందని ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)